అనగనగా

లేత మనసులు -- మల్లాది వేంకట కృష్ణమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషాల్ గీసే బొమ్మని వెనక నించి చూసే చెల్లెలు చెప్పింది.
‘‘బావుంది. కాని ఆకాశంలో మబ్బులు గీయాలి.’’
‘‘నువ్వెప్పుడూ ఇంతే.
ఏదో తప్పు చెప్తూంటావు.
నేనేం చేయాలో నువ్వు చెప్పద్దు. నీది దరిద్రపు మొహం.’’
నిషాల్ కోపంగా అరిచాడు.
వాళ్ళని తల్లి నిశ్శబ్దంగా గమనించింది.
ఆ సాయంత్రం పార్క్‌లో ఇద్దరు పిల్లలూ ఆడుకుంటున్నారు.
నిషాల్ వచ్చి తల్లిని ఓ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు.
‘‘దీని ఆకు మీద ఊదు!’’
ఆమె ఊదితే అది ముడుచుకుంది. కొద్దిసేపటికి అది తెరచుకున్నాక మళ్ళీ చెప్పాడు.
‘‘తాకి చూడు.’’
ఆవిడ దాన్ని తాకితే ఆకులన్నీ ముడుచుకుపోయాయి.
‘‘ఆశ్చర్యంగా ఉందే! ఎందుకు ఇవి ఇలా ముడుచుకుంటున్నాయి?’’ నిషాల్ అడిగాడు.
‘‘ఈ మొక్కల ఆకులు తమకి హాని జరక్కుండా స్పర్శ తగలగానే ముడుచుకుంటాయి. పురుగులు, వర్షపునీరు వీటికి హాని చేస్తాయి.’’
‘‘ఇలాంటి మొక్కలు ఉంటాయని నాకు తెలీదు.’’ వాడు చెప్పాడు.
‘‘ఈ మొక్కలు నీ చెల్లెలు లాంటివి.’’ తల్లి కొద్దిక్షణాల తర్వాత చెప్పింది.
‘‘చెల్లెల్లాంటివా? ఎలా?’’ అడిగాడు.
‘‘వీటిని ముట్టుకుంటే హాని జరుగుతుందని ఆకులు ఎలా ముడుచుకుంటున్నాయో, అలా నువ్వు అనే కఠినమైన మాటలకి చెల్లి అలా ముడుచుకుపోతోంది.
మనసు ఇంకాస్త బాధపడకూడదని దూరంగా వెళ్ళిపోతోంది.
చెల్లెలు బాధ గురించి నీకు ఇదివరకు చెప్పాను.
కాని నువ్వు మర్చిపోయినట్లున్నావు.’’
‘‘సారీ అమ్మా!
ఈ చెట్ల ఆకుల్ని చూసేదాకా చెల్లి ఎలా స్పందిస్తోందో నాకు అర్థం కాలేదు.
ఇక మీదట అలా మాట్లాడను.’’
నిషాల్ చెల్లెలి దగ్గరకి వెళ్ళి సారీ చెప్పాడు.
నాట్ టు టైప్ యూ వర్డ్స్ టు హెల్ప్, నాట్ టు హర్ట్.
*

-- మల్లాది వేంకట కృష్ణమూర్తి