అనగనగా

ముడతలు పోవాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నుంచి తిరిగి వచ్చిన యోషిత బేగ్‌ని బల్ల మీద ఉంచి బట్టలని ఇస్ర్తి చేసే తల్లి దగ్గరకు వచ్చింది.
‘అమ్మా! నీకోటి తెలుసా? మాడ్రాయింగ్ టీచరంటే నాకు చాలా ఇష్టం కదపా. ఆయనకి బదిలీ అయిందిట. ఆశ్చర్యంగా మా అందరికీ మా కేరికేచర్స్ గీసిచ్చారు’ అంది
‘ఆయన చాలా గర్విష్టి అని చెప్పావు కదా?’
‘అవును. ఒక్క నాతో తప్ప మిగతా అందరితో చాలా గర్వంగా ప్రవర్తిస్తారు. అందరికీ బొమ్మ లు గీసిస్తారని ఎవరూ అనుకోలేదు’
‘ఆయన కూతురేనా ఈ మధ్య పోయిందని చెప్పావు’ అని అడిగింది తల్లి.
‘అవును. ఏదో జబ్బు చేసి పోయింది. పాపం భార్య కూడా తర్వాత ఆయన్ను వదిలి వెళ్లిపోయిందట. ఆయన పొదుపు చేసిన చిట్ ఫండ్ వాళ్లు కూడా మోసం చేశార్ట. ’
‘ఆయనకు అన్నీ కష్టాలే అన్నమాట’
‘అవును. కొత్తగా డయాబెటీస్ వచ్చింది’
‘నీ ఉతికిన యూనిఫాంని తీసుకుని రా. దాన్ని ఇస్ర్తి చేస్తాను’ అంది తల్లి
యోషిత తెచ్చిన యూని ఫాం మీద నీళ్లు చల్లి ఇస్ర్తి చేసింది. దానిన చూసి యోషిత ఇలా అడిగింది.
‘అరె ముడతలన్నీ ఎంత చక్కగా పోయాయో?’
‘అవును. ముడతలు ఎందుకు పోయాయి?’ తల్లి నవ్వుతూ అడిగింది.
‘ఇస్ర్తి పెట్టెతో రుద్దడం వల్ల’
‘అందుకే కాదు ఆ బరువుతో పాటు వేడి వల్ల కూడా’
కొద్దిసేపాగి మళ్లీ తల్లి చెప్పింది.
‘ఒక్కోసారి దేవుడు మనలోని ముడతలని సరిచేస్తుంటాడు.’
‘మనలోని ముడతలా? నాకు , నీకు ఎక్కడా ముడతల్లేవు నాన్నకి కూడా’ అంది యోషిత.
తల్ల నవ్వి చెప్పింది.
‘నేను చెప్పే ముడతలు కంటికి కనిపించేవి కావు. మన ప్రవర్తనలోని ముడతలు. అసహనం, కోపం, ఆత్మనూన్యత, గర్వం లాంటి ముడతలని దేవుడు కష్టాలనే వత్తిడిని, వేడిని కలిగించి తొలగిస్తుంటాడు. ’
‘మా డ్రాయింగ్ టీచర్ విషయంలో అలాగే జరిగింది. అవును.లేకపోతే అది వరకు లాగే ఉండేవారు కదా.’
‘నిజమే. దీన్ని బట్టి మనం ఎలాప్రవర్తించాలో నాకు అర్థమైంది. సహనాన్ని కోల్పోకూడదు.’యోషిత చెప్పింది.

మల్లాది వేంకట కృష్ణమూర్తి