అనగనగా

గమ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నుంచి తిరిగి వచ్చిన నూపుర్ ని చూసి తల్లి అడిగింది
‘‘ఇంత ఆలస్యమైందేటి’’
‘‘నేను ఫుట్‌బాల్ ఆడి వస్తున్నాను. నన్ను టీంలో ఎంపిక చేశారు’’ నూపుర్ ఉత్సాహంగా చెప్పాడు.
‘‘బాగా ఆడావా?’’ తండ్రి అడిగాడు.
‘‘ఆడాను. రెండు పాయింట్లతో గెలిచాం’’
స్కూల్ యూనిఫారాన్ని విప్పిన నూపుర్ దాన్ని దానికి నిర్దేశించిన బుట్టలో వేయకుండా బాల్కనీ గుమ్మం ముందు పడేయడం గమనించిన తల్లి అడిగింది.
‘‘అంతదాకా వెళ్లిన వాడివి ఇంకో అడుగు వేసి విప్పిన బట్టలని వాటి బుట్టలో వేయచ్చుగా?’’
‘‘అలసిపోయానమ్మా’’
తండ్రి వెంటనే అడిగాడు.
‘‘బంతిని గోల్లోకి కొట్టాలంటే అంచెలంచెలుగా ఆ బాల్‌ని తన్నుకుంటూ వెళ్తావుగా?’’
‘‘అవును’’
‘‘మధ్యలో కొన్ని సార్లు అలా తన్నడం మిస్ చేస్తే ఏవౌతుంది?’’
‘‘అప్పుడు బంతి గోల్ వైపు వెళ్లకుండా ఫీల్డ్ మధ్యలో ఆగిపోతుంది’’ నూపుర్ జవాబు చెప్పాడు.
‘‘అంటే బంతి గోల్లో పడటానికి అటువైపు తనే్న ప్రతి కిక్ అవసరం అన్నమాట’’
‘‘అవును’’
‘‘అంటే ప్రతీ కిక్ కీ విలువ ఉందన్నమాటేగా?’’
‘‘అవును’’
‘‘ఇలాగే జీవితంలో కూడా మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా చిన్న విషయాలు అవసరవౌతాయి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే విడిచిన బట్టలని తప్పనిసరిగా వాటి బుట్టలోనే వేయాలి. స్కూల్ నుంచి రాగానే బూట్లు విప్పి వాటి స్థానంలో ఉంచాలి. చదువుకునేటపుడు గుర్తుంచుకోవాల్సిన వాక్యాలని అండర్‌లైన్ చేసుకోవాలి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు, ఇటు చూడాలి. ఇవి చిన్నవిగా కనిపించినా ఏ ఒక్కటి మిస్ ఐనా మనం లక్ష్యాన్ని చేరుకోనట్లే..’’
‘‘అర్థమైంది.’’ నూపుర్ చెప్పాడు.
‘‘నవ్వు అన్నం కలుపుకున్నాక చేతిని నోటి దాకా తీసుకెళ్లి, నోట్లో పెట్టుకోకుండా మళ్లీ కిందకు తీసుకువచ్చినట్లుగా ఉంది ఇందాక నువ్వు చేసిన పని’’తల్లి నవ్వుతూ చెప్పింది.
నూపుర్ వెంటనే లేచి వెళ్లి విడిచిన స్కూల్ యూనిఫాం ని బాల్కనీలోని బుట్టలో వేసాడు.
*

--మల్లాది వేంకట కృష్ణమూర్తి