అనగనగా

గుర్తుంచుకునే వయస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీకు నా కళ్ళజోడు ఎక్కడైనా కన్పించిందా?’’ తాతయ్య శ్రేయసిని అడిగాడు.
ఆయన చేతిలో భజగోవిందం పుస్తకం ఉంది.
‘‘అది మళ్లీ పోయిందా తాతయ్యా? ఇందాక నువ్వు పీజా డెలివరీ తీసుకున్నపుడు కళ్ళజోడు పెట్టుకునే ఉన్నావు’’ శ్రేయసి చెప్పింది.
‘‘పీజా తింటూ భజగోవిందం చదివాను. అప్పుడు ఉంది.’’
‘‘ఆ తర్వాత ఎపుడు తీశావు? ఎందుకు తీశావు? గుర్తుతెచ్చుకో తాతయ్యా’’ శ్రేయసి చిన్నగా నవ్వుతూ చెప్పింది.
‘‘ఎందుకు తీసానబ్బా? స్నానం అయ్యాకే పీజా తిన్నాగా’’.
‘‘పోనీ ఏ గదిలో తీసావో గుర్తుతెచ్చుకో’’ మళ్లీ నవ్వుతూ చెప్పింది.
‘‘గుర్తులేదు. నీ నవ్వుని చూస్తూంటే నీకు తెలుసు అనిపిస్తోంది. ఎక్కడ ఉందో చెప్పు’’ తాతయ్య అడిగాడు.
‘‘బల్ల సొరుగులో చూడు’’
చూసాడు, కానీ ఆయనకి కనపడలేదు.
‘‘చెప్పు.. నీకు తెలుసు’’ ఆమె పకపక నవ్వుతూండటంతో అడిగాడు.
‘‘నీ తలమీదే ఉంది తాతయ్యా, పైకి పెట్టుకున్నావు’’.
‘‘ఓ! అవును కదా? గుర్తే లేదు.’’
ఆయన దాన్ని కళ్ళకి పెట్టుకుని భజగోవిందం పుస్తకం తెరిచాడు.
‘‘నీకీ శ్లోకాలన్నీ కంఠస్థమే కదా తాతయ్యా?’’
‘‘అవును. నా చిన్నప్పుడే వీటిని కంఠస్థం చేశాను. గీతలోని ఏడు వందల శ్లోకాలు కూడా నాకు వచ్చు. ఇప్పటికీ మర్చిపోలేదు. దీంట్లోని భాష్యాన్ని మాత్రమే చదువుతున్నాను.’’
‘‘కాని ఇందాక కళ్ళజోడు ఎక్కడ పెట్టావో మాత్రం గుర్తులేదు. చిన్న విషయాలు మర్చిపోతూంటావు. మరి అవెలా గుర్తున్నాయి?’’ శ్రేయసి అడిగింది.
‘‘చిన్నప్పుడు నేర్చుకున్నవి అన్నీ మన మెదడులో తేలిగ్గా నమోదైపోతాయి. పెరిగేకొద్దీ గుర్తుంచుకునే శక్తి తగ్గుతూంటుంది. అందుకే నా చిన్నతనంలోలాగా నువ్వు చిన్నపిల్లగా ఉన్నపుడే రోజూ నీకీ శ్లోకాలన్నీ నేర్పుతున్నాను. సరిగ్గా నీ వయసులోనే వీటిని కంఠస్థం చేయాలి. ఇవి నేర్చుకుంటే ముందు జీవితంలో అవసరమైనపుడు అవి ఉపయోగిస్తాయి. వాటి పారాయణంవల్ల పుణ్యం రావడమేకాక, పాపాన్ని కూడా దూరంగా ఉంచగలం’’ తాతయ్య వివరించాడు.
*

మల్లాది వేంకట కృష్ణమూర్తి