అనగనగా

దేవుని శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇందాక స్కూల్లో నా ఫ్రెండ్ సారా జీసస్ గొప్పవాడని నాతో వాదించింది. కాని నేను కృష్ణుడే గొప్పవాడని, ఎందరో దుర్మార్గులని చంపాడని, జీసస్ అలా చంపలేదని వాదించాను’’ స్కూల్ నుంచి వచ్చిన త్రిష్య తల్లితో చెప్పింది.
‘‘దుర్మార్గులని చంపకపోవచ్చు. కాని జీసస్ కూడా కృష్ణుడంతటి మహాత్ముడు. దేవుడిలోని గొప్పగుణాలు మనుషుల్లో కనిపించవు. జీసెస్‌లో అలాంటవి చాలా ఉన్నాయి’’ త్రిష్య తల్లి చెప్పింది.
‘‘జీసెస్ దేవుడైతే ఆయన్ని అలా చంపేస్తారా’’ మన దేవుళ్లల్లో ఎవర్నీ రాక్షసులు చంపపేదు కదా’’
‘‘జీసెస్ ఎన్నడూ చనన్న పాపం కూడా చేయలేదు. పాపం చేయకుండా ఉండేవాడే దేవుడు. అందువ్లే జీసెస్ ప్రజల్ని పాపం నుంచి రక్షించగలుగుతున్నాడు’’
తను చెప్పింది కూతురికి అర్థం కాలేదని గ్రహించిన తిష్య తల్లి చెప్పింది.
‘‘నీకు ఈ విషయం అర్థమయ్యేలా ఎలా చెప్తానో ఆలోచిస్తాననుండు’’
ఆమె షెల్ఫ్‌లోని బైబిల్‌ని అందుకుని తిరగేసి ఓ బొమ్మని చూపించి చెప్పింది.
‘ఇదిగో చూడు. ఇది ఓ కుష్టురోగి బొమ్మ. బైబిల్ లో అనేకసార్లు ఇది అంటువ్యాధని రాసారు. ప్రపంచంలోని చాలా చోట్ల ఈ వ్యాధి ఇంకా ఉంది. ’’
త్రిష్య ఆ ఫోటోని చూసి చెప్పింది.
‘‘పాపం! కాళ్లకిచేతులకి వేళ్లు లేవు. అసహ్యంగా కనిపించే మొండి కాళ్లు చేతులు’’
‘‘అవును. గుడ్డివాడు కూడా. నువ్వు ఇలాంటి వాడిని చూస్తే ఏం చేస్తావు.’’ తల్లి ప్రశ్నించింది.
త్రిష్య ఆలోచించి చెప్పింది.
‘‘త్రాగడానికి మంచినీళ్లిచ్చి , తినడానికి ఏదైనా పెడతాను’’
‘కాని అతను మరణించబోతున్నాడు. అతని పక్కన కూర్చుని, చేతులు పట్టుకుని‘‘ జీసెస్‌ని నమ్మితే నువ్వు స్వర్గానికి వెళ్తావు’‘ అని చెపగలవా?’
త్రిష్య మళ్లీ ఆలోచించి చెప్పింది.
‘‘నేను చేతులకి గ్లవ్స్, మొహానికి మాస్క్ వేసుకొని ఆ రోగం అంటకుండా చెప్తాను’’
‘‘అతనికి మానవ స్పర్శ అవసరం. నీకు ఆ రోగం అంటినా అతనికి సహాయం చేయగలవా? అతని రోగ క్రిములు నీ శరీరంలోకి ప్రవహింపచేసుకునే శక్తి నీకుంటే, నీలోని బలం, ఆరోగ్యం అతనిలో ప్రవహింప చేస్తావా’’
త్రిష్య ఆ ఆలోచనకే కంపించి పోయింది.
‘‘అది చాలా భయంకరమైన వ్యాధి. నేనా పని చేయను’’
‘‘జీసెస్ ప్రజల కోసం ఆ పని చేసాడు ఎన్నడూ పాపం చేయకపోయినా ప్రజల పాపాలన్నిటినీ స్వీకరించి మనకి పడాల్సిన శిక్షని శిలువ మీద తను స్వీకరించి బాగా బాధపడి మరణించాడు. శిలువ మీద భౌతికంగా తీవ్రంగా ఆయన బాధ పడటానికి కారణం మన పాపాలే.
‘జీసెస్ ఎందుకు దేవుడు అయ్యాడో ఇప్పుడు నాకు అర్థవౌతోంది. మనిషి చేయలేని ఉన్నతమైన త్యాగాన్ని వారి మీద ప్రేమతో కేవలం దేవుడే చేయగలడు’
అవును. మనిషి దేనినైనా చేయగలడు. కాని అతనికి పరిమితమైన శక్తి ఉంటుంది. అతనిలో శక్తి తోపాటు నేను అనే భావం ఉంటుంది. నేను అనే భావం వల్ల అంతశక్తిని ఉపయోగించి అతడు ఇతరులకు మేలు చేయలేడు ఒకవేళ చేయగలిగితే అతడే దేవుడు అవుతాడు. దేవుడు ఎక్కడో ఉండడు. మనందరిలో ఉంటాడు. ఆ దేవుడు చెప్పే మంచిని వినగలిగితే మనం ఇతరులకు కొద్దిగా నైనా సాయం చేయగలుగుతాం. అందుకే దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలని చెప్తారు. ఆ దారిలో అంటే దేవుడు చెప్పిన దారిలో నడుచుకుంటే మనమూ దేవుని ప్రియమైన వారిమి అవుతాము.
ఇపుడు జీసెస్ ఎవరుఎన్ని బాధలు అతనిని పెట్టినా జీసెస్ మాత్రం అందరికీ ప్రేమనే పంచాడు. అది దైవ శక్తి. దేవుని శక్తి అని త్రిష్య తల్లి చెప్పింది.
‘దీనే్న పరమత సహనం అంటారు. ఏ మతాన్ని కించ పరచకూడదు.’ తల్లి బోధించింది.
*