అనగనగా

రోడ్ బ్లాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కస్‌కి కార్లో బయలుదేరిన క్షిప్రా కొంతదూరం వెళ్లాక ఎదురుగా కార్లు ఆగి ఉండటం చూసింది. కారు దిగి వెళ్ళి చూసి వచ్చిన డ్రైవర్ చెప్పాడు.
‘‘పనివాళ్ళు రోడ్ ఎదురుగా ఉన్న బ్రిడ్జ్‌ని రిపేర్ చేస్తున్నారు. అందుకని ట్రాఫిక్‌ను తాత్కాలికంగా ఆపేశారు.’’22
‘‘ఎంతసేపు పట్టచ్చు?’’22 క్షిప్రా అడిగింది.
‘‘తెలీదు. కొంతసేపు పట్టచ్చు’’22
కిటికీలోంచి చూసిన క్షిప్రాకి తమ కారు ముందు రెండు లారీలు, కొన్ని కార్లు, ఓ మోటార్ సైకిల్, క్రేన్ ఉన్న ఓ వాహనం కనిపించాయి.
నదికి అవతలి ఒడ్డున సర్కస్ టెంట్ ఉంది. సాయంత్రం ఆరున్నరకి ఆట మొదలవుతుంది.
‘‘మనం సర్కస్‌కి లేటవుతామా?’’22 క్షిప్రా తండ్రిని అడిగింది.
‘‘నాకు తెలీదు కాని రోడ్ బ్లాక్స్‌ని తీస్తే తప్ప మనం ముందుకి కదల్లేం.’’22
‘‘పనివాళ్ళు పనిని త్వరగా పూర్తిచేస్తే బావుండును.’’2క్షిప్రా అసహనంగా చెప్పింది.
‘‘అది మన చేతుల్లో లేదు. కాబట్టి సహనంగా ఉండాలి.’’2తల్లి చెప్పింది.
వాళ్ళు పది నిమిషాలు వేచి ఉన్నాక ముందు కార్లు కదలడం క్షిప్రా గమనించింది.
‘‘చూడండి. రోడ్ బ్లాక్ తీసేసినట్లున్నారు.’’22
డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. కొద్దిసేపట్లో వాల్ళు బ్రిడ్జ్‌ని దాటి సర్కస్ రోడ్ ఎక్కారు.
‘‘్థంక్ గాడ్. మనం సర్కస్ మిస్సవం’’22 క్షిప్రా చెప్పింది.
‘‘ఈ ఉదయమే నేను మరోరకం రోడ్ బ్లాక్స్ గురించి చదివాను.’’22 తండ్రి నవ్వి చెప్పాడు.
‘‘ఏమిటవి?’’22
‘‘తొందరపాటు, అనాలోచితంగా ప్రవర్తించడం, ఆదుర్దా, చెడు ఊహించడం లాంటి రోడ్ బ్లాక్స్ గురించి చదివాను. మనం ఏ పనైనా చేసేప్పుడు ఇవన్నీ అంతరాయాన్ని కలిగించి పని సక్ర మంగా జరక్కుండా అడ్డుపడతాయి. కాబట్టి మనం ఈ రకం రోడ్ బ్లాక్స్‌ని మన జీవితాల్లోకి రానీకూడదు.’’2తండ్రి వివరించాడు. *

--మల్లాది వెంకటకృష్ణమూర్తి