క్రీడాభూమి

మళ్లీ ఓడిన ఆనంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 12: భారత గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో మూడో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. మాక్సిమ్ వచియా లాగ్రేవ్ (ఫ్రాన్స్)ను ఢీకొన్న అతను తన బలగాలను సక్రమంగా కదిలించలేకపోయాడు. ప్రత్యర్థి వ్యూహాత్మకంగా విరుచుకుపడగా, కనీసం రక్షణాత్మకంగా కూడా ఎత్తులు వేయలేక ఓటమిని కొనితెచ్చుకున్నాడు. కాగా, ఫాబియానో కరౌనా, అనీష్ గిరి మధ్య జరిగిన గేమ్ డ్రా అయింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ తన ప్రత్యర్థి హకారూ నాకమూరాను సులభంగా ఓడించాడు. వెసెలిన్ తపలోవ్‌పై లెవాన్ ఆరోనియన్ విజయం సాధించాడు. మైఖేల్ ఆడమ్స్, అలెగ్జాండర్ గ్రిస్చుక్ గేమ్ డ్రా అయింది.