యువ

యూలో- ఇంటికి అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లగూబలాంటి నిఘా పరికరం
రాత్రివేళల్లో చురుగ్గా చూడగలిగే గుడ్లగూబలు మీ ఇంటిని అనుక్షణం కాపలా కాస్తాయి. ఏ క్షణంలో ఏం జరుగుతోందో మీకు ఎప్పటికప్పుడు నివేదిక లిస్తాయి. అంతెందుకు? మీరు లేనప్పుడు మీ ఇంటికి ఎవరొచ్చిందీ..ఏం చేసిందీ దృశ్యరూపంలో కళ్లకు కడతాయి. నమ్మలేకపోతున్నారు కదూ! ఇదంతా నిజమే. అయితే గుడ్లగూబలు కాదు...అచ్చం గుడ్లగూబల రూపంలో ఉండే యూలో అనే నిఘా పరికరాలు. ఫోటోలో చూస్తున్నారుగా...అచ్చం గుడ్లగూబలా లేదూ. దీని గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వాస్తవానికి పెద్ద పెద్ద కళ్లులా కనిపించేవి రెండు ఎల్‌సిడి స్క్రీన్లు. మధ్యలో ఉన్న పొడవైన ముక్కు- కెమెరా. ఈ పరికరం కింద ఓ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. తలపై ఓ బటన్ ఉంటుంది. దీనిని నొక్కితే ఆన్ అవుతుంది. మరోసారి నొక్కితే ఆఫ్. ఒకసారి చార్జి చేసి, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ పరికరాన్ని ఉంచితే, చుట్టూ ఏం జరుగుతోందో అటు కెమెరాలోనూ, ఇటు వీడియోలోనూ కూడా బంధించి, మీకందిస్తుంది. మన పరోక్షంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఇదో చక్కటి నిఘా పరికరం. కాదంటారా? యూలో ధర 167 డాలర్లట.