రాష్ట్రీయం

రెండేళ్ళలో మార్కెట్‌లోకి ఆంధ్రా యాపిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 70 శాతం ప్రయోగాత్మక సాగు విజయవంతం
* సిసిఎంబి ఆచార్యులు డాక్టర్ రమేష్ ఆగర్వాల్
చింతపల్లి, మార్చి 12: రెండేళ్ళలో మార్కెట్‌లోకి అన్నమైకిల్ యాపిల్ మార్కెట్‌లోకి వస్తుందని సెంట్రల్ సెల్యూలర్ అండ్ మోలిక్యులర్ బయోలజీ(సిసిఎంబి) శాస్తవ్రేత్త రమేష్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సాగుచేస్తున్న అన్నమైకిల్ యాపిల్ తోటను సెంట్రల్ సెల్యూలర్ అండ్ మోలిక్యులర్ బయోలజీ (సిసిఎంబి) శాస్తవ్రేత్త రమేష్ అగర్వాల్ శనివారం పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ హైదరాబాద్ సిసిఎండి ద్వారా విశాఖ ఏజన్సీలో చింతపల్లి, అరకు , పాడేరు, ఒడిశాలో కోరాపుట్, ఆదిలాబాద్ ఏజెన్సీల్లో అన్నమైకిల్ యాపిల్ సాగు ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు. ఇప్పటికే 70 శాతం విజయవంతమైందని, మరో రెండేళ్ళలో యాపిల్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ప్రాంతాల్లో వేసవి మినహా మిగతాకాలంలో చల్లదనం ఎక్కువగా ఉంటుందని, ఇది యాపిల్ చెట్లకు అనుకూలమన్నారు. అందువల్లే సిసిఎండి ద్వారా ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేపట్టి విజయం సాధించామన్నారు. 3 వేల మొక్కలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్‌లో మరో ఏడువేల మొక్కలు 50 శాతం సబ్సిడీపై రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొక్కల పర్యవేక్షణ బాధ్యతను ఉద్యానవన శాఖ శాస్తవ్రేత్తలకు అప్పగించేందుకు పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంగీకరించినట్లు రమేష్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే చింతపల్లి, అరకు ప్రాంతాల్లో సాగు విస్తరించాలనే లక్ష్యంతో రైతులకు ఉచితంగా 3,500 మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎరువులు సైతం అందజేస్తామన్నారు. అర్హులైన రైతుల ఎంపిక పూర్తయిందన్నారు. కార్యక్రమంలో సిసిఎంబి శాస్తవ్రేత్త సి.వి.రావు, చింతపల్లి ఆర్‌ఎఆర్‌ఎస్‌ఎడి ఆర్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) చింతపల్లిలో సాగుచేసిన ఆంధ్రా యాపిల్ మొక్కను పరిశీలిస్తున్న శాస్తవ్రేత్తలు