ఆంధ్ర గాథాలహరి

మధురోహలు-115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ అతడు పరదేశవాసియై అరుగుదెంచి
వేయి కనుల తోడ సతిని వెదకుచుండ
చెట్టు చాటున గలగల చెవిని బడగ
అతని హృదయాన మధురోహలలముకొనియె

కొత్త అల్లుడు చాలాకాలం తరువాత అత్తవారింటికి వచ్చాడు. అతనికి కళ్ళు భార్యకోసం అదేపనిగా వెతుకుతున్నాయి. ఎంతకూ ఆమె కనపడదే! పెరట్లో వున్న చెట్టు చాటునుంచి గాజుల గలగలలు మాత్రం అతని చెవినిబడింది. ఆమె అక్కడ స్నానం చేస్తోందని గ్రహించి అతని మదిలో మధురోహలు ముసురుకున్నాయి.

ప్రాకృతమూలం

అవరహ్ణాగ అజమా ఉఅస్సవి ఉణేఇ హేహణుక్కంఠం
వహు ఆఇ ఘరపలోహరమజ్జనా పిసుణోవల అసద్దో
సంస్కృతచ్ఛాయ
అపరాహ్ణాగత జామాతు ర్ద్విగుణయతి మోహనోత్కంఠాం
వధ్వా గృహ పశ్చాద్భాగ మజ్జన పిశునో వలయ శబ్దః
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949