ఆంధ్ర గాథాలహరి

అలిగిన వేళనే చూడాలి....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ణూమేంతి జే పహుత్తం కువి అం దాసావ్వజే పసా అంతి
తేవ్వి అ మహిలాణం పిఆ సేసా సామివ్విఅ వరా ఆ (మాధవుడు)
సంస్కృతఛాయ
గోపాయంతి యే ప్రభుత్వం కుపితాం దాసా ఇవఏ ప్రసాదయంతి
తవ ఏవ మహిలానాం ప్రియాః శేషా స్వామిన ఏవ వరాకాః
తెలుగు
ఆ.వె
దాస్య వృత్తి చేత, తన అలుకను దీర్చు
మగని ప్రియుడని, మది మగువ తలచు
అట్లు కానివారి, ఆ యింటి యజమాని
గానె, పరిగణింత్రు కాంతలెపుడు
భార్య అలిగినవేళలో, సేవలు చేసి ప్రసన్నం చేసుకునేవారినే భార్యలు అమితంగా ప్రేమిస్తారు. ప్రియులుగా భావిస్తారు. తక్కిన వారిని కేవలం ఇంటి యజమానులుగానే పరిగణిస్తారు.
వివరణ: సమయానికి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చి పడేసే భర్తలను భార్యలెపుడు యజమా నులుగా భావిస్తారు. ఇది గాథాకారుని తీర్పు. నిజమే నండోయ్ ఇట్లాకాక మంచి భర్తలు కావాలంటే మాత్రం భార్యమనసెరిగి ఏకాలంలో ఏది కోరుకుంటుందో అభిమానమో, ప్రేమనో, విలువైన వస్తువులో ఏది ఎపుడు అవసరమో దాన్ని గమనించి ఇవ్వాలి కాని ఎపుడూ వస్తువులే తెస్తే మగనికి కూడా వస్తువులకు తగ్గ బహుమతి మాత్రమే లభిస్తుంది. అందుకే ఈ గాథాకారుని కర్తవ్య బోధను మనసులో ఉంచుకుని భార్యలమనసెరిగి మసలుకుంటే చాలు వారి దాంపత్యం ఆదర్శవంతమై అనురాగ మమకారాలతో మూడు పువ్వులూ ఆరుకాయలు కాస్తుంది. చిరుబుర్రులాడే మగువల మనసు దోచుకునేందుకు ఈ ఫార్ములా పాటించి చూడండి. నేటి దాంపత్య బంధానికి కావాల్సిన ఫార్ములా ఆనాడే ఇచ్చిన గాథాకారునికి భర్తలు ఋణపడ్డారు కదా.

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949