ఆంధ్ర గాథాలహరి

భావనయే బలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృత మూలం
అవి అహ్ణ పేక్షణి జ్జేణ తక్ఖణం మామి! తేణ ది ట్ఠేణ
సివిణ అపీఏణ వ పాణి ఏణ తహ్ణ వ్వి అ ణ ఫిట్ఠా! (వజ్జుడు)
సంస్కృత ఛాయ
అవితృష్ణ ప్రేక్షణీయేన తతణం మాతులాని తేనదృష్టేన!
స్వప్నపీతేనేవ సానియేన తృష్ణైవ న భ్రష్టా!!
తెలుగు
క్షణములోన ప్రియు కనిపించి మరుగాయె
తనివితీరదాయె, తాపమాయె
కమ్మనైన జలము, కలలోన ద్రావంగ
దాహమెట్లు తీరు, దేహమునకు
ప్రియుణ్ణి ఉత్సవంలో క్షణకాలం మాత్రమే చూడగలిగింది. ఆమెకు తనివి తీరలేదు. తృప్తి కలుగలేదు. అందుకే చెంతనే వున్న మేనత్తతో ‘‘కలలో ద్రావిన నీటితో దప్పిక తీరుతుందా! అత్తా!’’ అని అంటోంది.
వివరణ: ప్రేయసీ ప్రియులు ఎపుడూ భావనాలోకంలో ఉంటారు. వారి కలలనే ఎక్కువ కంటుంటారు. నిజాలకన్నా వూహలే తీయగా ఉంటాయని వర్తమానాన్ని వదిలి భవిష్యత్తులో విహరిస్తుంటారు. ఇది ఎక్కువ ప్రియులే చేస్తుంటారు. ప్రియురాలు వూహల్లో విహరించినా వాస్తవమేదో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటూ ఉంటుంది. నిజమే కదా. ప్రియురాలు కంటినిండా ఒక్క సారి తన ప్రియుడ్ని చూడాలనుకోవడం సహజమేపైగా కాని అది ఎలా సాధ్య వౌతుందో తెలియక అనుభవజ్ఞురాలైన తన అత్తతో ‘‘కలలో ద్రావిన నీటితో దప్పిక తీరుతుందా! అత్తా!’’ అంటోది. గాథాకారుడు కథానాయక మనసులో జొరబడి ఆమె కల నిజం చేసు కొనేందుకు పడే తపననను, తాప త్రయాన్ని తెలియపర్చాడు.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949