ఆంధ్ర గాథాలహరి

తీపిగుర్తులివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
అజ్జవిబాలో దామోదరో త్తి ఇఅ జంపిఏ జసో ఆఏ
కహ్ణముహపేసి అచ్ఛం ణి హుణం హసిణం వఅహూహిం (విగ్గహుడు)
సంస్కృత చ్ఛాయ
అద్యాపి బాలో దామోదర ఇతి ఇతి జల్పితేయశదయా
కృష్ణముఖ ప్రేషితాక్షం నిభృతం హసితం వ్రజవధూభిః
తెలుగు
ఆ.వె
మాతృమమత తప్ప మరియేమి ఎరుగని
చిన్నికృష్ణుడెంత చిన్నవాడో

అని యశోద పలుక, ఆ గోపకాంతల
ముఖముమీద నవ్వు, ముసురుకొనియె
గోపకాంతలు యశోదమ్మ చుట్టూ చేరారు. ‘‘మా చిన్ని కన్నయ్యకు నేను తప్ప వేరే లోకం లేదని’’ యశోదమ్మ మురిసిపోతూ చెపుతూంటే గోపాలకృష్ణుని చిలిపి పను లు తలపునకు రాగా గోపిక లు ముసిముసిగా నవ్వుకున్నారట.
వివరణ: ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డడే కదా. అట్లాంటి లోకాలన్నీ మెచ్చిన చిన్ని కృష్ణుడి గురించి యశోదమ్మ కు ఎంత ఆనందం వస్తుందో కదా. అందులోను గోపి కల ఇండ్లల్లో వెన్న దొంగలించి తిని, తన స్నేహితులకు పెట్టి తిరిగి వారిండ్ల కోడళ్ల మూతికి పూసి న కన్నయ్య ను మరి చిన వారెవరుంటారు. వారంతా యశోదమ్మ కు ఫిర్యాదులు చేయ వస్తే ‘‘అమ్మా అమ్మా వీరంతా నన్ను కొట్టించ డానికే వీరిలా చెబుతు న్నారమ్మా ’’ అని గారం గా చెప్పే ఆ చిన్ని వానిని చూసిన యశోదమ్మకు ఎదుటివారే ఎగ్గులు చెప్పు తున్నట్టు అనిపించడంలో అసహజం ఏముంది? ఆ గోపాల బాలుడు తమతమ ఇండ్లల్లో చేసిన చిలిపి పనులు తలుచుకుని వారెంత నవ్వుకున్నారో, కోపం తెచ్చు కున్నారో ఆ గోపి కులకు గుర్తు వచ్చి సన్నని చిరునవ్వు నవ్వుకున్నారు. పోతన విరచించిన భాగవతం చదివితేనే ఆ కృష్ణుని లీలలు గుర్తు వచ్చి కళ్లు చెమ్మ గిల్లుతాయ కదా. మరి కృష్ణుని స్వయాన చూసినవారి సంగతి వేరుగా చెప్పాలా?

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949