ఆంధ్ర గాథాలహరి

గోదావరి వరద - ఈత సరదా (ఆంధ్రగాథాలహరి-65)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
తస్స అ సోహగ్గగుణం అమహి లాసరిసం చ సాహసం మజ్ఘ
జాణఇ గోలా ఊరో వాసాత్తో ద్ధరత్తో అ (మకరధ్వజుడు)
సంస్కృత ఛాయ
తస్యచ సౌభాగ్య గుణ మహిళా సదృశం చసాహసంమమ
జానాతి గోదాపూరో వర్షారాత్రార్థరాత్రశ్చ!
తెలుగు
తే.గీ వాని ఎదలోని గాఢవౌ వలపుతలపు
సహజ సిద్ధముకాని నా సాహసమ్ము
రాత్రి కురిసిన వర్షధారలకు తెలియు
కదము తొక్కు గోదావరీనదికి తెలియు
భావం: నాయిక తన చెలికత్తెతో ఇలా అంటోంది
రాత్రి కురిసిన జోరువానలో, మహోగ్రమైన గోదావరీ వరద ప్రవాహానికి ఎదురీది మరీ వాణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాను. నా మీద వాడికిగల గాఢమైన ప్రేమ, అసాధారణమైన నా సాహసం- ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టికి తెలుసు, మహోగ్రంగా కదం తొక్కుతూ ప్రవహించిన గోదావరీ నదికి మాత్రమే తెలుసు.
వివరణ
మామూలుగానే గోదావరిని ఈదడం కష్టం. అందునా నిండు వర్షాకాలంలో మహోగ్రంగా ప్రవహించే గోదావరి నదిని ఈది ఆవలి ఒడ్డుకు చేరిన మహిళామణిని అభినందించకుండా ఉండలేం. ప్రేమ గుడ్డిది అంటారు కానీ, ప్రేమ సాహసవంతమైనది కూడా! ఈ గాథ చదువుతూంటే ‘సాహసం సేయరా! డింభకా! రాకుమారి లభిస్తుంది’ అనగానే నిప్పుల్లో దూకిన తోటరాముడు (పాతాళభైరవి చిత్రం) మనకు జ్ఞప్తికి రాకమానడు. ప్రేమ అర్థవంతమై న్యాయబద్ధమైనప్పుడు తప్పకుండా సఫలమవుతుంది. ప్రేమలో ఉన్న అప్యాయత త్యాగ గుణాలు దైనినైనా చేయడానికి ఉత్తేజాన్ని, ఉత్ప్రేరకాన్నిస్తాయ. అసలు ప్రేమే ఒక ఉత్ప్రేరకం. కనుక గోదారినే కాదు సంసార సాగరాన్ని ఈదడానికి దంపతులకు శక్తినిచ్చేది ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే కదా. - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949