ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి--67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ ప్రయాణమా?
============

తెలుగు
తే.గీ నీధు తలపులతో నన్ను నేను మరువ
చిక్కు బడినట్టి జడయైన చక్కబడక
మునుపె, కఠినాత్మ! పరదేశమునకు నేగ
యోచనంబుమదిని, సేయుచుంటివేల?
‘‘ఓరుూ! కఠినాత్ముడా! నిన్నగాక మొన్ననే కదా! దూర దేశాన్నుంచి వచ్చావు. సరియైన పోషణ లేక మెలిదిరిగి చిక్కుబడిన శిరోజాలు ఇంకా జడకు కూడా రావడంలేదు. అప్పుడే మళ్లీ ప్రయాణమంటూ తయారవుతున్నావేమిటి?’’ అంటూ నాయిక నిష్ఠూరాలాడుతోంది.
ప్రాకృతమూలం
అవ్వో దుక్కర ఆర అ పుణో వితంతి కరేసిగమణస్య
అజ్జ విణ హూంతి సరలావేణి అ తరంగిణో చి ఉరా (సరళుడు)
సంస్కృత చ్ఛాయ
అహో! దుష్కర కారక పునరపి చింతాం కరోషి గమనస్య
అద్యపిన భవంతి సరలా వేణ్యా! స్తరంగిణాశ్చికురాః
వివరణ
తరచూ ప్రయాణాలంటూ ఊళ్ళు పట్టుకు తిరిగేవాళ్ళ ఇళ్ళల్లో కనిపించే దృశ్యం ఈ గాథ. ఎప్పుడూ ఇంటి పట్టున ఉండకుండా క్యాంపులంటూ తిరిగేవాళ్ళను భార్యలిలాగే నిలదీస్తారు మరి. కాని ఆ పతిదేవుని అవస్థనూ గమనించాలి. ఊళ్ళు తిరిగే ఉద్యోగమైతే అతడేం చేయగలడు. ఒక్కొక్కసారి ఉన్నంతలో అవగాహనతో సర్దుకుపోవడమే సరైన మార్గంగా అనిపిస్తుంది. ఇలా పని ఉండి వేరే వూర్లకు వెళితే ఫర్వాలేదు కానీ ఉన్న వూరిలోనే కథనాలు జరిపిస్తూ ఇల్లు వాకిలి పట్టకుండా ఇల్లు గుల్ల చేసే పనులు చేస్తే భార్యే భర్తను నిలదీయాలి. కట్డడి కూడా చేయాల్సిందే. దంపతులిద్దరూ సంసార బండికి చక్రాలు కనుక ఒకరికొకరు సాయంగా ఉండాలికాని ఒక చక్రంపైనే బరువు వేసి బండిని లాగుదాం అనుకొంటే బండి విరిగిముక్కలు చెక్కలౌతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త అని గాథాకారుడు హెచ్చరిస్తున్నాఋ. నేటికాలంలోనో....!

--ఇంకావుంది...

-- డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949