ఆంధ్ర గాథాలహరి

రహస్యం శాశ్వతం( ఆంధ్రగాథాలహరి-78)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె
మంచివాని యొక్క మనసులో నున్నట్టి
ఏ రహస్యములును, ఎన్నడైన
వెలికిరావు, తుదకు కలహంబు గల్గినన్
కాలిపోవునవియు, కట్టెతోడ
-ఇది ఒక నీతిగాథ. ‘‘సజ్జనుడైన వాడితో స్నేహం చేస్తూ చెప్పుకున్న ఎలాంటి పరమ రహస్యాలయినా వానితోనే నశిస్తాయిగానీ, ఎన్నడూ బయటకు రావు. తుదకు కలహం కలిగిన సందర్భంలో కూడా!’ అని నాయకుడు చెపుతున్నాడు.
వివరణ: ఏదైనా రహస్యం స్నేహితులు మనతో చెప్పుకున్నారంటే అది మన మీద నమ్మకంతోనే. అలా చెప్పుకోవడంవల్ల వారి మనసులోని బాధ కొంత తగ్గి తేలిక పడుతుందని భావన. అలా తెలిసిన రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. అందుకే మంచి స్నేహితుడు ‘మనలోని మంచిని పదిమంది ముందూ చెపుతాడు. చెడును మాత్రం చెవిలో చెపుతాడు’ అని ఆర్యోక్తి.
రహస్య గోపనం కూడా స్నేహానికి అతి ముఖ్యమైన అర్హత. స్నేహితుల్లోను దుర్జనులుంటారు. మంచి
స్నేహితులనైతే దూరంగా ఉన్నా అక్కడికి వెళ్లి స్నేహం చేయ మన్నారు. దుర్జనులైతే దగ్గరగా ఉన్నా వారి జోలిని విడిచి పెట్టమన్నారు.
ప్రాకృత మూలం
కలహాంతరే వి అవిణగ్గ ఆఇం హి అఅమ్మి జరమువగ ఆ ఇం సుఅణ క ఆఇ రహస్సా ఇం డహఇ ఆఉ క్ఖ ఏ అగ్గీ
సంస్కృత చ్ఛాయ
కలహాంతరే ప్యవినిర్గతాని హృదయే జరాముపగతాని సుజన శ్రుతాని రహస్యాని దహత్యాయుః క్షయేగ్ని - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949