ఆంధ్ర గాథాలహరి

ఆంధ్రగాథాలహరి--79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలిసిందిగా!
=======

తే.గీ కనులని యొకండు కలువలేయని యొకండు
పలుకదొడగిరి హోళికా పర్వమందు
ముదిత ప్రియుగాంచి కన్నులు మూసికొనగ
తెలిసెగా! చెవుల గలవి కలువలనియు
అది కాముని పున్నమి హోలీ మహోత్సవం. ఒక సౌందర్య రాశి చెవులకు కలువపూలనలంకరించుకొని రాజవీధిలో వయ్యారంగా నడుచుకుంటూ వెళుతోంది. చూస్తున్నవాళ్ళెవరూ ఆమె కనులకూ కలువలకూ భేదాన్ని గుర్తించలేకపోయారు.
కానీ ఆమెకు తన ప్రియుడు ఎదురురాగానే అప్రయత్నంగా ఆమె సిగ్గుతో కనులు మూసుకొంది. అప్పుడందరికీ అర్థమయ్యిందట ‘ఆమె చెవులకు కలువపూలనలంకరించుకుందని’. ఆమె కన్నులు కలువపూవులంత అందంగా, కన్నులేవో కలువలేవో తెలియలేనంత సుందరంగా ఉన్నాయని గాథాకారుడి చమత్కారం.
జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు కుందనపు బొమ్మ లాగా ఉన్న అమ్మా య కనుక ఆ సౌందర్యరాశి కలువ పూలు పెట్టుకున్నా చంపకమాలలు
ధరించినా ఆ అందాన్ని రెట్టింపు చేస్తాయ.
ఒక్కోక్కసారి ఆ సహజమైన అందాలు కూడా ఈ అందాల కొమ్మల దగ్గర వెలవెలా పోయనా ఆశ్చర్యపడనక్కర్లేదు సుమా. యవ్వనంలో ఉన్న పడతుల అందానికి సాటి వచ్చువారెవరు ఉంటారు?

ప్రాకృతమూలం
పి అదం సణ సుహర సము ఉలి ఆఇ జఇ సేణ హొంతిణ అణాఇం
తాకేణ కణ్ణర ఇ అం లక్ఖిజ్జఇ కువల అం తిస్సా (వసంతసేనుడు)
సంస్కృత చ్ఛాయ
ప్రియదర్శన సుఖరసము కులితేయది తస్యాన భవతోనయనే
తదా కేన కర్ణర చితం లక్ష్యతే కువలయం తస్యాః
*

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949