ఆంధ్ర గాథాలహరి

జాగ్రత్త! అబ్బాయ్! -83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె నీలకంఠు కొరకు నీరమ్ములే చాలు
వెదకుచుంటివేమి? విరులకొరకు
ఎంతవారినైన, ఈ గౌతమీ తటుల్
చెరుపగలవటంద్రు, చిన్నవాడ!
ఒక పెద్దావిడకు గోదావరి గట్టుమీద రోజూ ఒక నవ యువకుడు, విద్యావంతుడు కనపడుతూ ఉండేవాడు. ఆమె ఏమిటి వెతుకుతున్నావ్? అని అడిగేది. దేవుడి పూజ కొరకు పూలు కోస్తున్నాను అనేవాడతను. ఆ పెద్దావిడకు స్పష్టాస్పష్టంగా ఈ యువకుడు ప్రేమ దారిలో వున్నాడేమో అనిపించింది. అందుకే ఇలా అంది. ‘‘అబ్బారుూ! దేవుడైతే నీళ్ళతో కూడా తృప్తిపడతారంటారు కదా! అదేపనిగా పూలకసం తిరుగకు, ఏ పూపొదరింట్లో ఏముంటుందో! ఎంత మంచివారినైనా ఈ గోదావరి గట్టు అంత కుదురుగా ఉండనియ్యవంటారు! జాగ్రత్త సుమా! అని హెచ్చరించింది.
ప్రాకృతమూలం
మా వచ్చ పుప్ఫలా విరదేవా ఉఅ అంజలీహి తూసంతి
గో ఆ అరీఅ పుత్తఅ సీలుమ్మూలాఇఁ కూలాఇం (రొందణుడు)
సంస్కృత చ్ఛాయ
మా వ్రజ పుష్పలవనశీల దేవా, ఉదకాంజలిభిస్తుష్యంతి
గోదావర్యాః పుత్రక శీలోన్మూలాని కూలాని
- ఇంకా ఉంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949