ఆంధ్ర గాథాలహరి

అశోకమా! నీవశోకమవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ కనన శోకమా! నీవశోకమవు, నిజము
పడతి చరణాహతికి, సుంత బాధపడక
పల్లవింతు వెల్ల హృదులు పల్లవింప
నీదు నిరుపమ రసికత నెన్నదరమె
స్ర్తిలు కాలితో తంతే అశోక వృక్షం కుసుమించి విరగబూస్తుందని లోకంలో నానుడి. కవి సమయం కూడా! ఇదే విషయాన్ని ధ్వని గర్భితంగా చెపుతున్నాడు గాథాకారుడు. ‘‘ఓ అశోకమా! నీవు నిజంగా అశోకానివే! కారణమేమంటే నీకు శోకం లేదు. స్ర్తిలు నిన్ను కాలితో తన్నినా నీకు శోకం రాదు. పైగా సంతోషించి విరబూస్తావు. నిరుపమానమైన నీ రసికత ఎంతైనా మెచ్చదగింది కదా!’’ అని చమత్కరిస్తున్నాడు.
వివరణ: దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ ఆడిట్యూడ్) అంటారు. మొక్కల్లో కూడా ఈ లక్షణాన్ని నాడే గమనించిన గాథాకారునికి నమస్కరించకుండా ఉండలేం. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతగా పైకెగురుతుంది. అలా తనకు ఎదురవుతున్న కష్టాలను, సమస్యలను అవకాశాలుగా మలచుకొని అభివృద్ధిపథంలో నడవాలని అశోకవృక్షం మనకు నేర్పే పాఠం.
ప్రాకృతమూలం
రసి అవి అట్ఠ విలాసి అసమఅణ్ణ అ సచ్చఅం అసోఓసి
వరజు అయి చలణ కమలాహఓ వి జం వి అససిస అహ్ణమ్ (బ్రహ్మచారి)
సంస్కృతచ్ఛాయ
రసిక విదగ్థ విలాసిన్సమయజ్ఞ సత్యమశోకోసి
వరయువతి చరణ కమలా హతోపి యద్వికససి సతృష్ణమ్
*

--డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949