ఆంధ్ర గాథాలహరి

ఇప్పుడే ఇలా ఉంటే... 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ గ్రామణి తనయ నవ యువక హృదయాల
ముగ్థగానె, మోహంబులో ముంచుచుండె
విషపు చెట్టు వోలె పెరిగి పెరిగి ముందు
ముందు ఈ బాల ఏ కొంప ముంచగలదో
గ్రామాధికారి కుమార్తెను గూర్చి ‘ఈమె ఇంత చిన్న వయస్సులోనే తన తళుకు బెళుకులతో గ్రామంలోని యువకులందరినీ మోహంలో ముంచుతోంది. ఈమె గనక పెరిగి పెద్దదై ప్రౌఢగా మారితే ఏ ప్రమాదం కొనితెస్తుందో!’’ అని జనం పలు విధాలుగా అనుకుంటున్నారని భోజయుడనే గాథాకారుడు చెపుతున్నాడు.
వివరణ:కొందరు చిన్నతనంలోనే ముదురు మాటలు, వయసుకు మించిన పనులు చేయడం సమాజంలో చూస్తుంటాం. అది పెంపకంలో లోపం కావచ్చు లేదా పరిసరాల ప్రభావమూ కావచ్చు. పెద్దలు సకాలంలో గుర్తించి వీరిని సరైన మార్గంలో పెట్టకపోతే వీరి భవ్యిత్తు ప్రశ్నార్థకమవుతుంది. వీరివల్ల మరికొందరి జీవితాలూ ప్రమాదంలో పడే అవకాశముంది.
నిజమే! ఇది కానీ నేటి తరుణంలో పిల్లలు అతిగారాబంగా పెరుగుతూ తోటివారిని, పెద్దవా రిని చులకనగా చూస్తు న్నారు. ఏదైనా కోరుకుంటే అది ఎదుటివాళ్లను బాధించైనా సరే సాధించాలను కొంటున్నారు. ఈ ధోరణిని పెద్దలు మా పిల్లలు ఏది కావాలంటే అదే చేస్తారు... అంటూ వగలు పోతున్నారు. పెద్దవారిని అగౌరవపరుస్తుంటే కూడా ఏమీ అనడంలేదు. కానీ తనదాక వస్తే... ఆ చందంలో.అదీ తొందరలో వస్తుంది. అపుడు గానీ చీమకుట్టదు. అటువంటి వారికి ఇది కనీసం కనువిప్పు కావాలి.
ప్రాకృతమూలం
ఎత్తాఇచ్చి అ మోహం జణేఇ బాలత్తణే వివట్టంతీ
గామణి ధూ ఆ విసకందలివ్వ వడ్డీఆ కాహిఇ అణత్థమ్ (భోజకుడు)
సంస్కృతచ్ఛాయ
ఏతావత్యేవ మోహం జనయతి బాలత్వే పి వర్తమానా
గ్రామణీదుహితా విషకందళీవ వర్థితా కరిషత్య నర్థమ్
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949