రాష్ట్రీయం

అంగన్ వాడీలపై ప్రభుత్వ జులుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : వేతనాలు పెంచాలని కోరుతూ శుక్రవారం చలో విజయవాడ పిలుపు మేరకు పలు జిల్లాల నుండి బెజవాడకు చేరుకున్న అంగన్ వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డు వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అంగన్ వాడీలు పేర్కొన్నా పోలీసులు వినిపించుకోలేదు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. దీనితో పోలీసులు, అంగన్ వాడీల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలుస్తోంది.