జాతీయ వార్తలు

కేరళ క్రీడామండలికి అథ్లెట్ అంజూ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళ క్రీడామండలి అధ్యక్ష పదవికి ప్రముఖ అథ్లెంట్ అంజూ జార్జ్ బుధవారం రాజీనామా చేశారు. క్రీడల మంత్రి జయరాజన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పదవి నుంచి తప్పుకున్నట్లు ఆమె ప్రకటించారు. గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హయాంలో కేరళ క్రీడామండలి అధ్యక్షురాలిగా అంజూ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ అధికారంలోకి వచ్చాక క్రీడల మంత్రిగా జయరాజన్ బాధ్యతలు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం ఆయన క్రీడామండలి కార్యవర్గంతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా హాజరైన తనపై క్రీడల మంత్రి అవినీతి ఆరోపణలు చేయడమే గాక తనను వేధించారని అంజూ చెబుతున్నారు. ఈ విషయమై సిఎం విజయన్ కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం పదవికి రాజీనామా సమర్పించారు.