అంతర్జాతీయం

అంకారాలో కారుబాంబు పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

34 మంది మృతి.. 125 మందికి గాయాలు
అంకారా, మార్చి 14: టర్కీ రాజధాని అంకారా నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే ఓ కూడలిలో జరిగిన ఓ ఆత్మాహుతి కారుబాంబు పేలుడులో కనీసం 34 మంది మృతి చెందగా మరో 125 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రం, స్థానిక రవాణా కూడలి కూడా అయిన కిజిలే స్క్వేర్‌కు సమీపంలో ఆదివారం సాయంత్రం 6.45 గంటల సమయంలో సంభవించిన ఈ పేలుడుకు బస్టాండ్‌లో ఉండే బస్సులు కాలి బూడిదై పోగా, దగ్గర్లో ఉన్న షాపులు సైతం దెబ్బతిన్నాయి. పేలుడు పదార్థాలు నింపి ఉన్న ఓ వాహనం కారణంగా ఈ పేలుడు సంభవించింది.
బస్టాప్‌ను టార్గెట్‌గా చేసుకుని ఒకరు లేదా ఇద్దరు ఈ వాహనాన్ని నడిపారని హోం మంత్రిత్వ శాఖ అంటోంది. ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంటు, విదేశీ దౌత్యకార్యాలయాలకు దగ్గరగా ఉండే సెంట్రల్ అంకారా ప్రాంతంలో గత అయిదు నెలల్లో ఇలాంటి ఆత్మాహుతి దాడులు జరగడం ఇది మూడోసారి. సెంట్రల్ అంకారాపై దాడి జరిగేందుకు కుట్ర జరుగుతోందని, అందువల్ల ఈ ప్రాంతానికి అమెరికా పౌరులు వెళ్లకుండా ఉండడం మంచిదంటూ గత శుక్రవారం అమెరికా ఓ హెచ్చరిక కూడా చేసింది. దాడి వెనుక ఉన్న ఉగ్రవాద ముఠాకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని, త్వరలోనే వారెవరైందీ బయటపెడతామని టర్కీ ప్రధాని అహ్మెత్ దావుతోగ్లు పేర్కొన్నారు. బాంబు పేలిన సమయంలో టర్కీలో ఆస్ట్రేలియా రాయబారి జేమ్స్ లార్సెన్ అక్కడికి కేవలం 20 మీటర్ల దూరంలోనే కారులో ఉన్నారని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. సంఘటన స్థలంలో 30 మంది చనిపోయారని, మరో నలుగురు ఆస్పత్రిలో చనిపోయారని ఆరోగ్య శాఖ మంత్రి మ్యూజ్జినోగ్లు చెప్పారు.(చిత్రం) పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలను అణ్వేషిస్తున్న నిపుణులు