తెలంగాణ

అంతా అంకెల గారడీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడ్జెట్‌పై నిప్పులు చెరిగిన వామపక్ష నేతలు రవీంద్రకుమార్, సున్నం రాజయ్య

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన మూడో వాస్తవ భారీ బడ్జెట్ అంకెల గ్యారడీనేనని వామపక్ష శాసన సభ్యులు రవీంద్రకుమార్, సున్నం రాజయ్య ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారు మీడియా పాయింట్ వద్ద విలేఖరులతో మాట్లాడారు. బడ్జెట్‌లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కేటాయింపుల్లో తగ్గించి ఉత్తర, దక్షిణ తెలంగాణలో ప్రాంతీయ వివక్ష చూపారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్య, రవాణా సౌకర్యాలను విస్మరించారని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల పట్ల వివక్ష చూపారని వారు ఆరోపించారు. రైతురుణాల మాఫీ ఏక కాలంలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో నాలుగు వందలకు పైగా ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలను ఆదుకొని గౌరవించాల్సిన ప్రభుత్వం వారిని ఈ బడ్జెట్‌లో విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, తాను తన కుటుంబంలోని బిడ్డ, కొడుకు, అల్లుడు ప్రాతినిద్యం వహించే ప్రాంతాలకే ఇతోధికంగా నిధులు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ఈ బడ్జెట్ లేదని, కరవుతో తల్లడిల్లుతున్న ప్రాంతాలను వదిలిపెట్టి నామమాత్రంగా మూడు వందల మండలాలను కరవు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకున్నారని వారు పాలకవర్గంపై మండి పడ్డారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూపంపిణీ గాలికొదిలేశారని, హరిజన, గిరిజనులకు మూడెకరాల భూమి ముసుగులో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను, భూపంపిణీ కార్యక్రమాన్ని విస్మరించిందని వారు నిశితంగా విమర్శించారు.