Others

నాకు నచ్చిన సినిమా - అంకురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిని నిలదీసిన అబలగా, విధిని, పోలీసు అకృత్యాలను ఎదిరించిన మానవతామూర్తిగా రేవతి నటించిన అంకురం సినిమా అంటే చాలా ఇష్టం. ఒక సాధారణ బడిపంతులు కూతురు అత్తారింటికి వెళ్లడం కోసం రైల్లో ప్రయాణిస్తుంటే సత్యం అనే గిరిజనుడు తన చంటిపాపను ఆమెకు అప్పగించి, నీళ్లకోసం కిందికి దిగుతాడు. తర్వాత అతను రాడు, పాపను తీసుకోడు. ఆ పాపను తండ్రికి అప్పగించాలని ఆమె పొందిన తపనే ఈ చిత్ర కథాంశం. ఒక గ్రామంలో జరిగిన అకృత్యాలు ఈ సినిమాకు నేపథ్యంగా నిలుస్తాయి. ఆ గ్రామంలో జరిగిన నేరాలకు సాక్షీభూతుడు ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేర శిక్షించబడుతున్న సత్యం బయటపడాల్సిన తరుణంలో పోలీసు అడ్డుకోబోతే రేవతి పాత్ర కనువిప్పు కలిగిస్తుంది. బిడ్డతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ వర్ణనాతీతం. అబల సబలగా మారి సత్యాన్ని, జరిగిన అకృత్యాన్ని బయటపెడుతుంది. ‘ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు నడవరా ముందుకి అటో ఇటో ఏటోవైపు’ అన్న ఈ చిత్రంలోని చైతన్య గీతం ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తుంది. అప్పట్లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల స్ఫూర్తితో చిత్రాన్ని రూపొందించారు. ఓంపురి, శరత్‌బాబు, హరిప్రసాద్, బాలయ్య తదితరులు నటించిన సినిమాకు సి ఉమామహేశ్వరరావు అద్భుతమైన దర్శకత్వ ప్రతిభను జోడించి రూపొందించారు.
-పట్టిసపు శేషగిరిరావు,
విశాఖపట్నం