అంతర్జాతీయం

ఖర్చుకు హద్దేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 21: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తమ ఎన్నికల వ్యయాన్నీ బాగా పెంచుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా స్వంత పార్టీలోనే మద్దతు పడిపోతున్న నేపథ్యంలో ట్రంప్ ఆగస్టు నెలలో చేసిన వ్యయంతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో రెండింతలకు పైగా ఖర్చు చేశారు. సెప్టెంబర్‌లో ఆయన సుమారు 70 మిలియన్ డాలర్లు ఎన్నికల కోసం వ్యయం చేశారు. మరోవైపు, అధికార పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల వ్యయంలో ఆయనను మించిపోయారు. ఆమె సెప్టెంబర్ నెలలో 83 మిలియన్ డాలర్లకు పైగా వ్యయం చేశారు. వీరిద్దరు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన తాజా ఆర్థిక నివేదికలు పెరిగిన వీరి ఎన్నికల వ్యయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలలో నెగ్గడానికి నాటకీయంగా వీరిద్దరు అనుసరిస్తున్న భిన్న మార్గాలను కూడా ఈ నివేదికలు వెల్లడించాయి. ట్రంప్ అడ్వర్టయిజ్‌మెంట్లపై ఎక్కువగా ఖర్చు చేస్తుండగా, హిల్లరీ క్లింటన్ మాత్రం తన ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్న మీడియా సిబ్బందిపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అత్యధికంగా 800 మంది మీడియా సిబ్బందిని కలిగి ఉన్న హిల్లరీ క్లింటన్ నెలలో సుమారు 5.5 మిలియన్ డాలర్లను ఇందుకోసం వ్యయం చేశారు. ఆమె ఒక నెలలో అత్యధిక వ్యయం చేసిన పద్దుల్లో రెండో అతి పెద్ద పద్దు ఇదే కావడం విశేషం. హిల్లరీ సుమారు 66 మిలియన్ డాలర్లను మీడియా కోసం వెచ్చించారు. ట్రంప్ సుమారు 350 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లకు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే ట్రంప్ తాజాగా టెలివిజన్ అడ్వర్టయిజ్‌మెంట్లు, పోలింగ్ సేవలపై వ్యయాన్ని తగ్గించారు. కాని, సెప్టెంబర్‌లో అతను 23 మిలియన్ డాలర్లను అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం వెచ్చించారు.
నేను గెలిస్తేనే ఒప్పుకుంటా!
ఎన్నికల ఫలితాలపై ట్రంప్
వాషింగ్టన్/ డెలవేర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఎన్నికల ఫలితాలను పూర్తిగా ఆమోదిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఎన్నికలను రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మూడో డిబేట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసిన ట్రంప్ తరువాత ఓహియోలోని డెలవేర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అయితే నవంబర్ 8న జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రశ్నార్థకంగా ఉంటే వాటిని న్యాయస్థానంలో సవాలు చేసే హక్కు తనకు ఉందని ఆయన వివరించారు. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ‘నేను విజయం సాధిస్తే, చరిత్రాత్మకమైన, గొప్పవైన ఈ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను పూర్తిగా ఆమోదిస్తానని నా ఓటర్లకు, మద్దతుదారులకు, అమెరికా దేశ ప్రజలకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాను’ అని ట్రంప్ అన్నారు.

చిత్రం... న్యూయార్క్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌తో కరచాలనం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్. పక్కన ట్రంప్ భార్య మెలానియా