ఆంధ్రప్రదేశ్‌

అన్నవరం కొండపై అశ్లీల నృత్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: అన్నవరం ఆలయ పరిసరాల్లో ఓ వివాహ వేడుక సందర్భంగా శనివారం తెల్లవారు జామున కొందరు మద్యం మత్తులో చిందులు వేయడం, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై ఆలయ ఇఓ స్పందించారు. ఇందుకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. మందు పార్టీ, అశ్లీల నృత్యాల్లో పాల్గొన్న పెళ్లిబృందానికి కూడా ఇవో నోటీసులు ఇచ్చారు. తెల్లవారు జామున 3 గంటలకు పెళ్లివేడుకలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తుండా కొందరు భక్తులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి మీడియాకు అందజేశారు. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఇఓ రంగంలోకి దిగారు.