అనంతపురం

మలి విచారణలో సోలార్‌హబ్ అవినీతి వెలుగు చూసేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబులపూలకుంట, డిసెంబర్ 12: సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు అందించే పరిహారం జాబితాలో అక్రమార్కుల పేర్లు మరోమారు జరిగే విచారణలో వెలుగుచూస్తాయా లేదో అంటూ మండల వాసులు చర్చించుకుంటున్నారు. సోమవారం నుంచి మండలంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ల సమక్షంలో నాలుగు బృందాలు క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నట్లు రెవెన్యూ అధికారులు వివరించారు. ప్రతి బృందానికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ సాగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అసైన్‌మెంట్ పట్టాదారులు, సాగుదారుల జాబితాపై విచారణ సాగుతుందన్నారు. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటులో భాగంగా అసైన్‌మెంట్ పట్టాదారులు సుమారు మండలంలో 750 లబ్ధిదారులు వున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. అయితే అసైన్‌మెంట్ కమిటీలో ఆమోదం లేకుండా కొందరి రైతుల పేర్లను జాబితాలో చేర్చి పరిహారాన్ని స్వాహా చేయడం జరిగిందని కొంతమంది గ్రామస్తులు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్లు రైతుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. నంబులపూలకుంట పంచాయతీలో 374 పట్టా రైతులు వుండగా ఇప్పటికే 235 రైతులకు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. మరో 43 మందికి మాత్రమే నంబులపూలకుంట పంచాయతీలో పరిహారం పంపిణీ కావాల్సి వుంది. అదేవిధంగా పి కొత్తపల్లి పంచాయతీలో 397 మంది అసైన్‌మెంట్ పట్టాదారులు వున్నారని, ఇప్పటికే రెండు విడతల్లో 248 మంది రైతులకు పరిహారం పంపిణీ పూర్తికాగా, 115 మంది అసైన్‌మెంట్ పట్టాదారు రైతులకు పరిహారం పంపిణీ కావాల్సి వుంది. అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం లేకుండానే కొంతమంది రైతులు అక్రమంగా పట్టాలు పొంది రికార్డులు తయారుచేశారని రైతులు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై జిల్లా అధికారులకు కొంతమంది రైతులు బహిరంగంగా ఫిర్యాదు చేశారన్నారు. రెవెన్యూ అధికారులు సాగు చేసిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా కాసులు ఇచ్చిన వాడికి అక్రమంగా అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం లేకుండానే పట్టాలు ఇచ్చిన ఘనత మండల రెవెన్యూ అధికారులదేనని రైతులు విమర్శిస్తున్నారు. సాగుదారుల జాబితాలో అక్రమంగా పేర్లు నమోదు చేసి సాగుదారుల జాబితా 1156 మందిని గుర్తించారు. సాగుదారులను గుర్తించడానికి పలుమార్లు విచారణ చేసిన అధికారులు నిజమైన సాగుదారులకు అన్యాయం చేసి అక్రమంగా ఎంతోమంది రైతుల పేర్లను చేర్చి పరిహారం కాజేయడానికి సిద్ధమైన పక్షంలో జిల్లా అధికారులు త్వరిగతిన స్పందించి పరిహారం పంపిణీ నిలుపుదల చేయడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుంది. సోమవారం నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ల సమక్షంలో క్షేత్ర స్థాయిలో విచారణ అని చెప్పడంతో అక్రమార్కులు విచారణను అడ్డుకోవడానికి రైతులను పురిగొల్పుతున్నారు. పరిహారం తీసుకున్న రైతులు సైతం క్షేత్రస్థాయి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరోమారు జరిగే విచారణపై గ్రామాల్లో రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు. ప్రతి రైతు పొలంలోకి వచ్చి హద్దులు వివరించాలన్నారు. అదేవిధంగా సౌర విద్యుత్ కేంద్రం పనులు జరిగిన ప్రాంతంత రైతులు సైతం విచారణకు హాజరుకావాలన్నారు. అసైన్‌మెంట్ కమిటీలో ఆమోదం లేకుండా అక్రమంగా పట్టాలు పొందిన రైతులపై కొరఢా ఝులిపించడం ఖాయమని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. మరోమారు జరిగే విచారణలో అర్హులైన రైతులకు, సాగుదారులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
* డిఎఫ్‌ఓ రాఘవయ్య
మడకశిర, డిసెంబర్ 12 : జిల్లాలోని వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా అటవీశాఖ అధికారి రాఘవయ్య తెలిపారు. శనివారం మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 60 చిరుతలు, 13వేల కృష్ణ జింకలు, 150 ఎలుగుబంట్లు ఉన్నాయన్నారు. 1.19లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండగా 115 విడి భాగాలుగా ఉన్నాయన్నారు. వన్యప్రాణులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో రహదారులను దాటుతుండగా వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయన్నారు. వన్యప్రాణులు జన సంచారంలోకి రాకుండా ఉండే విధంగా అడవుల్లో నీటికుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 150 నీటికుంటలు ఏర్పాటు చేశామన్నారు. రహదారుల్లో వాహనాలు వేగంగా వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కదిరి, పెనుకొండ అటవీ ప్రాంతాల్లో మరో 15 నీటి కుంటలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల దాడిలో చనిపోయిన వారికి రూ. 5 లక్షలు, గాయాలకు గురైన వారికి రూ. 75వేలు, వైద్య ఖర్చులకు అందిస్తున్నామన్నారు. మేకలు, గొర్రెలు, పందులపై దాడి చేస్తే వాటికీ నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. గతేడాది రూ. 17లక్షలు, ఈ ఏడాది రూ. 12లక్షల వరకు బాధితులకు అందించామన్నారు. వన్యప్రాణుల దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి, అటవీ ప్రాంత సంరక్షణ కోసం అరణ్య రోధన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. శాఖాపరంగా సిబ్బంది కొరత వల్ల పర్యవేక్షణ కష్టంగా ఉందన్నారు. బుక్కపట్నం, పెనుకొండ, కదిరి అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వాహనం ఢీకొనే చిరుత మృతి
పట్టణ పరిసర ప్రాంతాల్లోని పావగడ రహదారి వద్ద వాహనం ఢీకొనడంతోనే చిరుతపులి మరణించిందని డిఎఫ్‌ఓ రాఘవయ్య తెలిపారు. పట్టణ సమీపంలో మృతి చెందిన చిరుత మృతదేహాన్ని పరిశీలించే నిమిత్తం డిఎఫ్‌ఓ శనివారం మడకశిరకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుత రహదారి దాటుతుండగా వాహనం ఢీకొని మృతి చెందిందన్నారు. ఈమేరకు చిరుతమృత దేహానికి అటవీ శాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. వన్యప్రాణుల సంచారం గురించి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది శామ్యూల్, చలపతి, పశువైద్యాధికారి నాగేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.