అనంతపురం

జీడిపల్లి వద్ద కృష్ణా పుష్కరాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, ఆగస్టు 12 : కృష్ణా పుష్కరాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మండల పరిధిలోని జీడిపల్లి జలాశయం వద్ద పుష్కర స్నానాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. ముందుగా జెసి దంపతులకు వేద పండితులు రామచంద్రరావు, జయన్న స్వామి, వేణుగోపాల్, తహశీల్దార్ వెంకటాచలపతి ఆధ్వర్యంలో పూర్ణకుంభం పలికారు. అనంతరం జెసి దంపతులు, అధికారులు, నాయకులు స్నాన సంకల్పం, సూర్యుడు, గురుడు, బృహస్పతి పుష్కరుడికి అర్ఘ్య ప్రధానం, దేవరుషులకు, మునులకు, కృష్ణమ్మకు వాయిన సమర్పణం, దేశం సుభిక్షంగా ఉండాలంటూ ప్రత్యేకంగా పూజించి, కృష్ణాజలాల్లో పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత శోభలతలు గోపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, అతని సోదరుడు పయ్యావుల శీనప్ప సహకారంతో జిల్లా టిడిపి నాయకులు మల్లికార్జున, పెద్ద తిప్పయ్య ఆధ్వర్యంలో కృష్ణమ్మ విగ్రహ ఏర్పాటుకు జెసి దంపతులు శంఖుస్థాపన చేశారు. ఇకపోతే జిల్లా నలమూలల నుంచి వచ్చే భక్తులు జీడిపల్లి రిజర్వాయర్‌లో పుణ్యస్నానం ఆచరించేంచేంకు స్పెషలాఫిసర్ మేఘన, తహశీల్దార్ వెంకటాచలపతి, వివిధ శాఖల అధికారులు, నాయకులతో కలసి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పిండప్రధానాల ఘాట్లు, దుస్తులు మార్చుకోవడానికి తాత్కలిక షెడ్లు, విద్యుత్ సౌకర్యం, వైద్యసేవలు, ప్రమాద సూచికలు తదితర ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కృష్ణానీటిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎఎస్‌ఐ విజయ్‌నాయక్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎఇ రామచంద్రరావు, ఆర్‌ఐ జగన్నాథ్, భాగ్యమ్మ, జీడిపల్లి సర్పంచ్ వెంకటనాయుడు, జిల్లా టిడిపి నాయకులు మల్లికార్జున, పెద్ద తిప్పయ్య, స్వాన్స్ క్లబ్ అధ్యక్షులు ఈశ్వరప్పలు పాల్గొన్నారు.