అనంతపురం

అనంతను అగ్రగామిగా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 15: రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాను అగ్ర స్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. సోమవారం అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం(పిటిసి)లో రాష్ట్ర స్థాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఒకనాడు కరవుకు మారు పేరు అని, ఈ అపప్రథ ఇంకెంతో కాలం కొనసాగదని అన్నారు. జిల్లాకు వ్యవసాయకంగా, పారిశ్రామికంగా, విద్యా, సాంస్కృతిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మూడో రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అనంతపురంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావుకు అత్యంత ఇష్టమైన జిల్లా అనంతపురం అని, జిల్లాలోని హిందూపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారన్నారు. టిడిపికి జిల్లా కంచుకోట. జిల్లా అంటే నాకు ప్రాణం, నా మనసులో ఉన్న జిల్లా ఇలాంటి జిల్లాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడారి కానీబోను. ఇప్పటికే జిల్లాలో లక్ష హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించాం, ఇంకా ఎంత అవసరమైనా డ్రిప్ కోసం నిధులు ఇస్తామని, అనంతపురాన్ని బ్రహ్మాండమైన జిల్లాగా తయారు చేసే బాధ్యత తీసుకుంటానని సిఎం హామీ ఇచ్చారు. రెయిన్ గన్ ద్వారా నీటి తడులు అందిస్తామన్నారు. పాదయాత్ర సందర్భంగా గుంతకల్లు ప్రాంతానికి వచ్చినపుడు అక్కడి రైతుల పరిస్థితి చూశాక, రైతు రుణ విముక్తిపై ఆలోచన చేశామని, అధికారంలోకి రాగానే అమలుచేశారని గుర్తుచేశారు. అలాగే ఇక్కడి వేరుశెనగకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామన్నారు. హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను ఇప్పటికే జీడిపల్లి వరకు తెప్పించామని, మున్ముందు జిల్లాలోని చెరువులన్నింటినీ కృష్ణా జలాలతో నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తున్నామన్నారు. సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తిని అనంతపురం, కర్నూలు జిల్లాలో చేపట్టేందుకు ప్రాధాన్యమిచ్చామన్నారు. జిల్లాను స్వచ్ఛ అనంతపురంగా తయారుచేయాలన్నారు. ఇందుకోసం నిధులు ఇస్తున్నామన్నారు. రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వాలన్నారు. చెరువుల్లో పూడిక తీయించి నీటిని నిల్వ ఉంచాలని, ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీటిని అందించేలా చేయాల్సి ఉందన్నారు. ఇందుకు నీటి భద్రతను పాటించాలన్నారు.
రికమెండేషన్ లేకుండానే ఉద్యోగాలు
ఎవరి రికమెండేషన్ లేకుండానే ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సిఎం చంద్రబాబు అన్నారు. పెన్షన్లు కూడా అక్రమాలకు తావు లేకుండా తీసుకునేలా చేశామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా వినూత్న ఫలితాలు వస్తాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ రెండేళ్లలో 5.50 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు రాష్ట్రంలో 1100 కోట్లతో పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను, 87 కోట్లతో 5.22 లక్షల మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ చెల్లించామన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధి పథకం కింద ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఉపాధి పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.10వేలు ఇస్తున్నామన్నారు. ఉర్దూకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కాపులకు హామీ ఇచ్చిన మేరకు వెయ్యి కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కింద వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్ని ప్రక్షాళన చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా దిగువకు ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశామని, ఈ ఏడాది నుంచే రాయలసీమకు కృష్ణా మిగులు జలాలను కేటాయించామని సిఎం తెలిపారు. ఈ యజ్ఞం వంశధార-నాగావళి, పెన్నా-కృష్ణలను అనుసంధానం చేసే వరకు ఆగదన్నారు. వచ్చే పుష్కరాలకల్లా నదుల అనుసంధానం చేసే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు.
3అనంత అంటే ఆత్మ బలిదానం
అనంతపురం అంటేనే ఆత్మ బలిదానమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ఖ్యాతిని కీర్తించారు. ఇందుకు తొలి నిదర్శనం హంపన్న త్యాగమన్నారు. 1893లో బ్రిటీష్ సైనికుల బారి నుంచి ఇద్దరు మహిళలను కాపాడే ప్రయత్నంలో తెల్లవారి తూటాలకు బలైన అమరుడు హంపన్న అని కొనియాడారు. అలాగే జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు టి.శివశంకరం పిళ్లై, పప్పూరు రామాచార్యులు, జీవ రత్నమ్మ, ఆదిశేషయ్య, కైవ సుబ్రహ్మణ్యశర్మ, హట్టి శంకరరావు, గుత్తి కేశవపిళ్లై, ఐదుకల్లు సదాశివన్, హరేసముద్రం నరసింగరావు వంటి మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా స్వాతంత్య్ర మహోదయానికి గుర్తుగా నేటికీ నిలిచి ఉన్న చిహ్నం నగరంలోని క్లాక్ టవర్ అని శ్లాఘించారు. అనంతపురం రాయల కాలం నుంచి చారిత్రక ఘట్టాలకు సాక్షి అని, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఎందరో ప్రముఖులను తెలుగువారికి అందించిన ఘనత ఈ జిల్లాదని ప్రశంసించారు. భారత రాష్టప్రతిగా, విశాలాంధ్ర దేశ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ప్రజా నాయకుడు కల్లూరు సుబ్బారావు రాజకీయ రంగంలో, సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సాహిత్య రంగంలోనూ, బళ్లారి రాఘవ, కదిరి వెంకటరెడ్డి సాంస్కృతిక రంగంలోనూ, పుట్టపర్తి సాయిబాబా వంటి మహనీయులు ఆధ్యాత్మిక రంగంలోనూ జిల్లాకు వనె్న తెచ్చారన్నారు. ఇపుడు సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సిఇఒగా అంతర్జాతీయంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింప జేశారని ప్రశంసించారు. కాగా మహాత్మాగాంధీ సూక్తిని సిఎం ప్రస్తావించారు. అలాగే 3స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి.. సాధించిన దానితో సంతృప్తిని పొందడం సరికాదోయ్.. అంటూ శ్రీశ్రీ భావితరాలను హెచ్చరించడాన్ని సిఎం ఈ సందర్భంగా వినిపించారు. తనకు ఈ మాట ఎంతో స్ఫూర్తినిచ్చిందని, కనుక ఇప్పటికి తాను సాధించిన దానితో సరిపెట్టుకోనని, రాష్ట్రాన్ని, అనంతపురం జిల్లాను అభివృద్ధి దశలో పురోగమింపజేయడమే తన లక్ష్యమని అన్నారు.