అనంతపురం

రూ. 42 కోట్లతో చారిత్రక కట్టడాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఆగస్టు 18: జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనంతపురం జిల్లాకు రూ. 42 కోట్ల నిధులు కేటాయించిందని పర్యాటక శాఖ రీజనల్ మేనేజర్ గోపాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సరస్వతితో గుత్తి కోటకు సంబందించిన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో చారిత్రక కట్టడాలు గుత్తి, పెనుగొండ, తిమ్మమ్మ మర్రిమాను తదితర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్ఛయంతో వుందన్నారు. అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబందించి ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను కోరడం జరిగిందన్నారు. గత ఏడాది ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల వెనక్కి వెళ్లాయన్నారు.