అనంతపురం

కర్నాటకకు ఇసుక తరలిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, ఏప్రిల్ 2 : మండల పరిధిలోని గ్రామాల నుంచి కర్నాటకకు ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సుబ్బారావు హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రైతులు తమకు అవసరమైన మేరకే ఇసుక తీసుకెళ్లాలన్నారు. నిర్మాణ పనుల పేర ఇసుక కర్నాటకకు తరలించే ప్రయత్నం చేస్తే వాహనాలను శాశ్వతంగా సీజ్ చేయడంతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కొందరు రాత్రి సమయాల్లో కర్నాటకకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకోసమే ముగ్గురు పోలీసులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు ఇసుక అక్రమ రవాణాపై ఆరా తీసి ముందస్తు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీ్ధర్, సిబ్బంది పాల్గొన్నారు.