అనంతపురం

రక్షక తడులతో రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 19:జిల్లాలో వర్షాభావం కారణంగా ఎండుతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు రెయిన్ గన్లద్వారా రక్షక తడు లు అందిస్తున్నట్లు జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ పేర్కొన్నారు. ఈమేరకు రూరల్ మండల పరిధిలోని ఇటుకలపల్లి గ్రామ పొలంలో అన్నగిరి నారాయణమ్మ అనే మహిళారైతుతో పాటు ఆమె ఐదుగురు కుమారులకు చెందిన 25 ఎకరాల వేరుశనగ పంటకు రక్షక తడులు అందిస్తున్న తీరును మీడియా బృందంతో కలసి శుక్రవారం జెసి-2 పరిశీలించారు. జెడిఎ శ్రీరామమూర్తి, ఎపిఎంఐపి పిడి వెంకటేశ్వర్లు, సమాచారశాఖ ఎడి తిమ్మప్ప తదితరులతో కలసి జెసి-2 రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులను అందించే విధానాన్ని ఎడిఎ రామేశ్వరరెడ్డి, ఎఓ వాసుప్రకాష్‌ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్థానిక రైతులతో జెసి-2 మాట్లాడుతూ జిల్లాలోని రైతన్నల సంక్షేమం కోసం ఎండిపోతున్న వేరుశనగ పంటకు రక్షక తడిని అందించాలనే సంకల్పంతో ఫ్రభుత్వం 4606 రెయిన్ గన్లను మంజూరు చేసిందన్నారు. గత మూడురోజులుగా వేరుశనగ పంటలకు రక్షక తడులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రైతు రెయిన్ గన్ల ద్వారా రక్షకతడులతో పంటలను కాపాడుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుర్తించిన 4900 హెక్టార్ల వేరుశనగ పంటకుగాను 2186 హెక్టార్ల వేరుశనగకు రక్షక తడిని అందించామన్నారు. 69వేల మంది రైతులు తమ బోర్ల ద్వారా పక్కరైతుకు నీరందించేందుకు ముందుకు వచ్చినట్లు జెసి-2 తెలిపారు. వానదేవుడు ముఖం చాటేసినపుడు రెయిన్ గన్లు మరో దేవుడిలా పంటకు ప్రాణం పోస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటిసి, ఎంపిపి, సర్పంచ్, స్థానిక రైతులు పాల్గొన్నారు.