అనంతపురం

దివ్యాంగులకు సౌకర్యాలపై టెస్ట్ ఆడిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 19:ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, చట్టాల్లో చేయడంతో పాటు వాటిని అమలు పర్చడంలో భాగంగా దివ్యాంగుల కోసం కూడా అనేక చర్యలు తీసుకుంది. ప్రజలు నిత్యం ప్రభుత్వ కార్యాలయాల గడపల్ని అనేక రకాల పనులపై ఎక్కిదిగుతుంటారు. ఈ క్రమంలో సకలాంగులు సైతం ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుండటం రివాజుగా మారింది. ఈ పరిస్థితుల్లో దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా కేంద్రం ప్రత్యేక చట్టం చేసింది. అందులో ముఖ్యంగా ఆటంకాలు లేని పరిసరాలు ఉండాలన్నది లక్ష్యం. ఇందుకోసం 1999లో డిజేబుల్డ్ ఫెలిసిటీ యాక్ట్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వివిధ రకాలైన దివ్వాంగులు ప్రభుత్వ కార్యాలయాలకు పలు విధాలైన పనుల నిమిత్తం వెళ్లినపుడు వారు ఆ ప్రాంతాల్లో సంచరించేందుకు వీలుగా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా ర్యాంపులు ప్రతి పౌరుడు సేవలు పొందే కార్యాలయాలు, సంస్థలో, విభాగాల్లో ఏర్పాటు చేయాలన్నది చట్టం ఉద్దేశం. అయితే ఎక్కడా ఈ పరిస్థితి లేకపోవడంతో వారు అనేక అవస్థలు పడుతున్నారు. దీనిపై జిల్లా దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఎంచుకుని టెస్ట్ ఆడిట్ ప్రారంభించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలంటూ ఏవీ లేవు. ముఖ్యంగా పలు రకాల శారీరక వైకల్యాలతో వచ్చే వారు సంచరించడానికి ర్యాంపు(ఏటవాలు మార్గం) సౌకర్యం ఎక్కడా లేదు. దీనిని ఏర్పాటు చేస్తే దివ్యాంగులు కార్యాయాల మెట్లు ఎక్కడం, దిగడం ద్వారా కలిగే సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యంగా తహశీల్దారు, ఎంపిడిఒ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, బ్యాంకులు, ఎటిఎం సెంటర్లు, ఈసేవ, మీ సేవ కేంద్రాలు, బిసి, ఎస్సి, ఎస్టి, తదితర కార్పొరేషన్లు, సంక్షేమ కార్యాలయాలు వంటి అనేక చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిలో కొన్ని కార్యాలయాల్ని జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎంపిక చేసుకుని టెస్ట్ ఆడిట్ (ప్రయోగాత్మక పరిశీలన)కు శ్రీకారం చుట్టింది. ఏయే సంస్థలు దివ్యాంగుల బాగోగుల కోసం తగిన సౌకర్యాలు కల్పించడం లేదో అటువంటి వాటి జాబితాను ఈ శాఖ రూపొందించనుంది. త్వరలో దానిని జిల్లా కలెక్టర్‌కు సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపి తగిన చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన వస్తే దివ్యాంగుల సౌకర్యాల కల్పనకు మార్గం లభించే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు.