అనంతపురం

ఎస్వీ డిగ్రీ కాలేజి గుర్తింపు రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 23: పేద విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులను వసూలు చేస్తున్న ఎస్వీ డిగ్రీ కాలేజి గుర్తింపును రద్దు చేయాలని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే నరేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో నరేష్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వమే ఫీజు చెల్లించి చదివిస్తోందని, అయినా ఈ విధానం కొన్ని ప్రైవేటు కాలేజీలకు కాసుల వర్షం కరిపిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి సమాఖ్య నాయకులు ఆనంద్, సురేష్, రాజా, బాలకొండ, కరుణకార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.