అనంతపురం

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, ఏప్రిల్ 2: వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని జెడ్.పి చైర్మన్ చమన్ ఆదేశించారు. శనివారం జెడ్‌పి చైర్మన్ అధ్యక్షతన జెడ్‌పి స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. గ్రామీణ నీటి సరఫరా పథకం ఎస్‌ఇ హరేరామ్ నాయక్ మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటడంతో కొత్త బోర్లకు అనుమతి లేదన్నారు. కొత్త పైపులైన్లను అనుమతించరన్నారు. ఉన్న బోర్లను డీపెనింగ్ చేయటం జరుగుతుందన్నారు. అలాగే వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం జరుగుతుందన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదనలు పంపామన్నారు. దీనిపై సభ్యులు మాట్లాడుతూ నీరున్నచోట పైపులైను ద్వారా నీటిని తీసుకెళ్లటానికి అవసరమయ్యే చర్యలు చేపట్టాలని కోరారు. పాడైపోయిన పైపులైన్లను మార్చటం ద్వారా నీటి సరఫరా మెరుగుపరచాలని కోరారు. అలాగే జిల్లాలో గ్రామీణ రహదార్ల మరమ్మతుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఎస్‌ఇ తెలిపారు. రోడ్ల మరమ్మతులకై రూ.60 కోట్లు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. వీటితో రోడ్ల మరమ్మతుతోపాటు దూరాన్ని తెలిపే కి.మీ రాళ్లు, మలుపు సూచికలు ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇ శేషగిరిరావు మాట్లాడుతూ తుంగభధ్ర డ్యామ్‌లో 78 టిఎంసిల నీరు లభ్యమైందన్నారు. హెచ్‌ఎల్‌సి ద్వారా జిల్లాకు 16 టిఎంసిల నీరు విడుదలైందన్నారు. 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించామన్నారు. 8.5 టిఎంసిల నీరు తాగునీటికై వినియోగించామన్నారు. వ్యవసాయ స్థారుూ కమిటీకి వైస్ చైర్మన్ గైర్హాజరీలో సీనియర్ సభ్యుడు లక్ష్మినారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. వేసవిలో పశువులకు సబ్సిడీతో మందులు పంపిణీ చేయాలని తీర్మానించారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 ట్రాక్టర్లను ఇవ్వాలని ఇందుకు సబ్సిడీని కూడా 75 శాతానికి పెంచాలని తీర్మానించారు.