అనంతపురం

సత్యసాయి సన్నిధిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఆగస్టు 25: భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. గురువారం ఉదయం సత్యసాయి గోకులం నుంచి సాయి విద్యార్థులు గోవులను, జింకలు, నెమళ్ళు, జంతు పక్షాదులను ఊరేగింపుగా ప్రశాంతి నిలయం తీసుకొచ్చారు. సత్యసాయి మహాసమాధి చెంత కృష్ణాష్టమి వేడుకలను ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, కార్యదర్శి ప్రసాదరావు, అశేష భక్తుల నడుమ పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి బాబాకు అమితంగా ఇష్టమైన జంతు, పశుపక్షాదులను ఆప్యాయంగా స్వీకరించి వాటికి పండ్లు, ఫలహారం, పాలను అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు చెందిన సుమారు 1200 మందికి పైగా సాయి భక్తులు పర్తి యాత్రగా ప్రశాంతినిలయం చేరుకున్నారు. దేశ, విదేశీ సాయిభక్తుల నడుమ కృష్ణాష్టమి వేడుకలను భక్తి భావంతో నిర్వహించారు. సంగీత కచేరి, డ్రామాలు, శ్రీకృష్ణ పరమాత్ముని లీలలను ప్రదర్శిస్తూ శుభోధ్యాయం నాటికలను బాలవికాస్ విద్యార్థులు ఆబాలగోపాలంగా ప్రదర్శించారు. గోవింద హరే, గోపాల హరే ఏ గోపబాల అనే భక్తి గేయాన్ని ఆలపిస్తూ భక్తులను ఉర్రూతలూగించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు.
గోకులంలో వేడుకలు
సత్యసాయి గోకులంలో నంద గోపాలుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోకులానికి చెందిన యాదవ సంఘం సభ్యులు కృష్ణాష్టమి పర్వదినాన్ని గోపాల బాలుని లీలలను, అవతారాన్ని కీర్తిస్తూ భక్తి భావంతో వేడుకలు నిర్వహించారు. గో పూజలు, కృష్ణుని ప్రత్యేక పూజలు నిర్వహించి యాదవ సంఘం సభ్యులు కోలాహలంగా వేడుకలను నిర్వహించారు. స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహానికి స్ర్తి, పురుషులు వందలాదిగా తమ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. శ్రీకృష్ణుని లీలలు ఉట్టిపడేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని శ్రీకృష్ణుని వేషధారణల్లో పలువురు చిన్నారులు ప్రదర్శనలిచ్చారు. అదేవిధంగా శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని గోకులం, గణేష్ సర్కిల్, ఎనుములపల్లి, పుట్టపర్తిలలో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ నాయకులు ఉమాపతి, రామప్ప, కౌన్సిలర్ వెంకటరమణమ్మ, ప్రభాకర్, గోవిందు, లక్ష్మిపతి, రామాంజనేయులు, చలపతి పాల్గొన్నారు.