అనంతపురం

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 25: జిల్లా సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఆ దిశగా టిడిపి ప్రజా ప్రతినిధులందరూ సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి పేర్కొన్నారు. ఈమేరకు పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం బికె.పార్థసారథి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పరిటాల సునీత, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీ బాల, జడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, అత్తార్ చాంద్‌బాషా, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మేయర్ మదమంచి స్వరూప, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. సమావేశం అనంతరం పార్థసారథి వివరాలను మీడియాకు వివరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జిల్లాకు ఎన్టీఆర్ ఆశయం పేరుతో రూ.6554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. కరవు జిల్లాను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో 6 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట సాగు చేశారని, వర్షాభావంతో ఎండుతున్న పంటను కాపాడేందుకు రక్షక తడులు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు అవసరమైన రెయిన్‌గన్లు ఇంకా రావల్సి ఉందన్నారు. ఇప్పటికే చాలా చోట్ల రక్షక తడులు అందిస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ జిల్లాలో 98శాతం మంది రైతులకు అయ్యిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద జిల్లాకు రూ.150 కోట్లు మంజూరయ్యిందన్నారు.
వీటిని ప్రాధాన్యతా క్రమంలో జిల్లా అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లు నియోజకవర్గానికి రెండు వేల మందికి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకురావడానికి సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొద్దీన్, నాయకులు ఆలం నరసానాయుడు, జకీవుల్లా తదితరులు పాల్గొన్నారు.