అనంతపురం

జిల్లాలో 120 చిరుతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 25 : జిల్లాలో చిరుత పులుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. గతంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వీటి సంతానోత్పత్తి ఈ ఏడాదికి బాగా పెరిగింది. అటవీ శాఖ చేపట్టిన వన్య ప్రాణుల సంరక్షణ, అటవీ సంరక్షణ చర్యల మూలంగా వన్య ప్రాణులకు ఆవాసం, ఆహారం లభ్యమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చిరుతల సంఖ్య 120కి చేరుకుంది. వీటిలో 20 నుంచి 25 వరకు 8 నెలల నుంచి ఏడాది లోపు వయసున్న చిరుత పిల్లలు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. 2010లో వీటి సంఖ్య కేవలం 15 మాత్రమే. చిరుతలు సహజంగా 13 నుంచి 14 ఏళ్ల లోపు దాకా జీవిస్తాయి. ప్రస్తుతం కళ్యాణదుర్గం, రాయదుర్గం అటవీ ప్రాంతంలో వీటి సంఖ్య అధికంగా ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అలాగే పెనుకొండ రేంజ్, మడకశిర, కదిరి ప్రాంతాలతోపాటు గుంతకల్లు ప్రాంతంలో ఒక చిరుత ఉన్నట్లు గుర్తించారు. కాగా చిరుతలు జనావాసాల్లోకి వస్తే వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక మొబైల్ రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేసింది. కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం అధికంగా ఉండటంతో కళ్యాణదుర్గం రేంజ్‌లో రెస్క్యూ టీమ్‌ను ఉంచారు. ఈ టీమ్‌తోపాటు బోనుతో కూడిన ఒక మొబైల్ వ్యాన్, 12 మంది శిక్షణ పొందిన సిబ్బంది, మత్తు మందు గుండు సామగ్రి, వలలు, తక్షణ వైద్యం కోసం ఇంజక్షన్లు, మందులు ఉంచారు. అలాగే మత్తుమందు ఇంజెక్ట్ చేసేందుకు జర్మన్ తయారీ అయిన ట్రాన్స్‌లేజర్ గన్ అందుబాటులో ఉంచారు. మొత్తం 9 బోన్లు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 6 రేంజ్ కార్యాలయాల్లో 5 చోట్ల ఒక్కొక్కటి చొప్పున సిద్ధంగా ఉంచారు. కళ్యాణదుర్గం రేంజ్‌లో మాత్రం 3 బోన్లు ఉన్నాయి. ఇక ఎలుగుబంట్లు విపరీతంగా ఉన్నాయని, నల్లమచ్చలున్న జింకలు సుమారు 10వేల దాకా ఉండొచ్చని అటవీ అధికారుల అంచనా. వీటిని మినహాయిస్తే చిరుతలతోపాటు ఇతర జంతువులు వెయ్యి దాకా ఉండొచ్చని అంచనా వేశారు.