అనంతపురం

గ్రామస్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, ఆగస్టు 29:2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేస్తామని బిజేపి జిల్లాఅధ్యక్షులు అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్యారడైజ్ హోటల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో 50శాతం ప్రజలు బిజేపికే మద్దతిస్తున్నారని వెల్లడైందని తెలిపారు. బినామిల పేరునవెళ్తున్న 36వేలకోట్లను అవినీతి సంపదను మిగిల్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు. కేంద్రప్రభుత్వం నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా పంపిణీ చేస్తోందని, స్టాండ్ ఆఫ్ ఇండియాద్వారా దళితులు పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు బిజేపి రూ.10కోట్లవరకు రుణాలు ఇచ్చేందుకు పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అమృత్ పథకంద్వారా తాడిపత్రి మునిసిపాలిటీ అభివృద్దికి రూ.150కోట్లను కేంద్రప్రభుత్వం ఇస్తున్నదేకాని, రాష్ట్రప్రభుత్వం ఇచ్చిందికాదన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంతో వేరుశెనగపంటను కిసాన్ సఫల్ భీమా యోజన క్రిందచేర్చలేదని, ఈవిషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెల్లి రైతులకు న్యాయం జరిగేల కృషిచేస్తామన్నారు. ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 2వరకు అనంతపురం కెటిఆర్ పంక్షన్‌హాల్‌నందు 400మంది జిల్లా ముఖ్యనాయకులకు ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రశిక్షణకు కేంద్ర వాణీజ్యశాఖమంత్రి నిర్మలా సీతారాం, బిజేపి ఏపి ఇన్‌చార్జ్ సిద్దార్థ్ నాసింగ్, రాష్ట్రఅధ్యక్షులు కంభంపాటి హరిబాబు, రాష్టశ్రాసనమండలి సభ్యులు సోమువీర్రాజు, మాజికేంద్రమంత్రి పురంధరేశ్వరి, బిజేవైఎం రాష్ట్రఅధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్రప్రధానకార్యదర్శి రవీంద్రబాబులు హాజరు అవుతారని తెలిపారు. అనంతరం తాడిపత్రిమండలంలోని కావేటిసముద్రం, వెంకటరెడ్డిపల్లి, అయ్యవారిపల్లిగ్రామలకుచెందినవారు బిజేపిలో చేరారు. జిల్లాఅధ్యక్షులు అంకాల్‌రెడ్డివారికి కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వనించారు. భారతీయ యువమోర్చ జిల్లాఅధ్యక్షులు హరీష్‌రెడ్డి, మండల కన్వీనర్ రాంబాబు, రంగనాథరెడ్డి, కేశవ, శేషానందరెడ్డి పాల్గొన్నారు.