అనంతపురం

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు జన చైతన్య యాత్రల లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 12:రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడమే జన చైతన్య యాత్రల లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి, పామురాయి గ్రామాల్లో మంత్రి సునీత జన చైతన్య యాత్రలలో పాల్గొన్నారు. గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేసి, గ్రామాలలోని సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు సమర్థవంతంగా పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి సమావేశానికి హాజరై ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కొడిమి గ్రామంలో 136 మందికి పెన్షన్‌ల కింద 1.52 వేలను ప్రతి నెలా అందిస్తున్నామని, 257 మందికి కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు అందాయని, వాటిని త్వరలోనే అందిస్తామన్నారు. పామురాయి గ్రామంలో 97 మంది వృద్ధులకు పెన్షన్లు, 87 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు అందాయని, వాటిని త్వరలోనే ఇస్తామని తెలిపారు. 50 వేల లోపు 110 మందికి మొదటి విడతలోనే రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో 49 చెరువులకు నీరిచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. గ్రామాలలో ఇంటి స్థలాలు లేని వారికి త్వరలోనే ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి మహేంద్ర, ఎంపిపి మాధవీలత, శిల్ప, జెడ్పిటిసి వేణుగోపాల్, మండల కన్వీనర్ లక్ష్మినారాయణ, ఎంపిటిసిలు జానకీబాయి, టిడిపి ఇన్‌చార్జి పవన్‌కుమార్, గ్రామ సర్పంచ్‌లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భూమి కోసం రైతు ఆత్మహత్యాయత్నం

తలుపుల, డిసెంబర్ 12: సాగు చేసుకుంటున్న భూమిని ఇతరులు దౌర్జన్యంగా దున్నుతుండగా అడ్డుకున్న రైతుపై దాడి చేయడంతో అవమానభారంతో ఆ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మండల పరిధిలోని మూలపల్లిలో జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. మూలపల్లికి చెందిన రైతు విశ్వనాథ్ గత ఇరవై సంవత్సరాలుగా బంజరు భూమిని సాగు చేసుకుంటూ భూమిపై హక్కుల కోసం పట్టా ఇవ్వాలని కోరుతూ తలుపుల రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. అయితే భూమిని దునే్న రైతులకే పట్టాలు ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు భూమిని వాస్తవంగా సాగు చేస్తున్న రైతు విశ్వనాథ్‌కు కాకుండా ఇతరులకు పట్టా ఇవ్వడం, శనివారం వారు విశ్వనాథ్ సాగు చేసిన పంటను ధ్వంసం చేస్తుండడంతో అడ్డుకోబోయిన విశ్వనాథ్‌పై దాడి చేశారు.
దీంతో మనస్థాపం చెందిన రైతు ఇంటికి వెళ్ళి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బంధువులు అతనిని చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి పరిస్థితి విషమంగా వుండడంతో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు.

రైతుకు ఎమ్మెల్యే పరామర్శ

కదిరిటౌన్ : తలుపుల మండలం మూలపల్లిలో భూమి కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతు విశ్వనాథ్‌ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం కదిరి ఎమ్మెల్యే ఆత్తార్ చాంద్‌బాషా పరామర్శించారు. భూపట్టా విషయంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు విశ్వనాథ్ ఆత్మహత్యాయత్నానికి బాధ్యతవహించాలన్నారు. అధికారులు వెంటనే ఆర్హుడైన, సాగుదారుడైన విశ్వనాథ్ పేర పట్టాను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్లిశివారెడ్డి, ఇలియాజ్, రవిశంకరనాయక్, అలి ఉన్నారు.