అనంతపురం

జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 30: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లాలో గడిచిన 24 గంటల్లో 16.8 మిమీ వర్షపాతం నమోదైంది. అగళి, రొళ్ల మండలాల్లో వర్షం కురువలేదు. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 68.8 మిమీ వర్షపాతం నమోదైంది. విడపనకల్లులో 2.5 మిమీ, వజ్రకరూరులో 6.6 మిమీ, గుంతకల్లులో 3.1, గుత్తిలో 22.6, పెద్దవడుగూరులో 39.2, యాడికి 48.5, పెద్దపప్పూరులో 38.8, కదిరిలో 36.2, అనంతపురంలో 53.7, బికె.సముద్రంలో 35.7, యల్లనూరులో 60.5, తాడిమర్రిలో 26.1, తలుపులలో 13.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. కాగా గత జూన్, జూలైలో వర్షాలు బాగా కురిశాయి. అయితే ఆగస్టు నెలలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే పంటలు ఎండుదశకు చేరుకున్న సమయంలో కురిసిన వర్షం ఊపిరి పోసినట్టయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.