అనంతపురం

భవిష్యత్తులో టిడిపి ఒక్కటే ఉంటుంది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, సెప్టెంబర్ 1 : రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న చర్యలతో భవిష్యత్తులో కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే రాష్ట్రంలో ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గురువారం హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక వైఎస్ జగన్ నేతృత్వంలోని వైకాపా కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో రాష్ట్ర సంపదను యథేచ్ఛగా దోచుకున్న జగన్‌కు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి రాలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి అశాంతిని నెలకొల్పేందుకు కుట్రలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసిన కాంగ్రెస్‌కు పుట్టగతులు లేవన్నారు. చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో ఎంతో విశ్వాసం పెరుగుతుండగా తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏదో రకంగా విమర్శలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాయన్నారు. ఆయా పార్టీల పట్ల నమ్మకం లేక ఎంతోమంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీనే మిగులుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఓటుకు నోటు కేసుపై మంత్రి స్పందిస్తూ ముగిసిన అధ్యయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బందులు పెట్టేందుకు వైకాపా పన్నాగం పన్నిందన్నారు. అవినీతి నిరోధక శాఖ కేవలం విచారణ సంస్థ మాత్రమేనని, ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదన్నారు. చట్ట విరుద్ధంగా ఎసిబికి ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశాలను కట్టబెట్టేందుకు ఫిర్యాదు చేయడం తగదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయస్థానాల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసునన్నారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పాటు పడుతున్నారని, భవిష్యత్తులో వైకాపా, కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు పాల్గొన్నారు.