అనంతపురం

1.81లక్షల ఎకరాలకు తడులు అందించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 3:జిల్లాలో వర్షాభావంతో ఎండిపోతున్న 1,80,356 ఎకరాల వేరుశనగ పంటకు రక్షక తడులను అందించి కాపాడిన రాష్ట్ర సిఎం చంద్రబాబునాయుడుని ప్రజలందరూ కొనియాడుతున్నారని రాష్ట్ర సమాచార, పౌరసంబందాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6రోజుల పాటు జిల్లాలో ముఖ్యమంత్రి మకాం వేసి మంత్రులను, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యావత్తు జిల్లా యంత్రాంగాన్ని మోహరించి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన ఘనత సిఎంకు దక్కుతుందన్నారు. ఎండుతున్న పంటకు రక్షకతడులందించి రైతు కంట కన్నీరు తుడిచే రక్షకతడిని అందించి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి ముందుండి నడిపించిన సిఎం రుణాన్ని జిల్లా రైతన్నలు జన్మజన్మలకు మరిచిపోలేరన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కలెక్టర్, ఇతర జిల్లా ఐఏయస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో సిఎం సూచనలను పాటిస్తూ రక్షకతడులను అందించిని వారందరికీ హృదయపూర్వక దన్యవాదాలు అన్నారు.

రక్షకతడులు అందించడంలో
అధికారులు భేష్
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, సెప్టెంబర్ 3:వేరుశనగ పంటకు రక్షకతడులు అందించడంపై కలెక్టర్, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్న సమయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొని వేరుశనగ పంట కు రక్షకతడులు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చూపిన చొరవకు ఆమె అభినందించారు. ఏ రాజకీయ నాయకుడు చేయని విధం గా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోనే ఉండి వేరుశనగ పంటకు రక్షకతడులు అందించడానికి ఆయన చూపిన చొరవ, ఆయన చేసిన కృషిని జిల్లా ప్రజలు మరువలేరన్నారు. ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని రైతులు అంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. పంట ఎకరం కూడా ఎండకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలో ముందుగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. రకక్షతడులు వేయకముందు ఉన్న వేరుశనగకు వేసిన తర్వాత ఉన్న వేరుశనగ వ్యత్యాసాలను పరిశీలించారు. రక్షకతడుల వల్ల పంట పూర్తిగా దెబ్బతినకుండా 50 శాతం వరకు కాపాడుకోగలుగుతామని రైతులు తెలియజేస్తున్నట్లు ఆమె అన్నారు. పేరూరు డ్యామ్, భైరవాని తిప్ప కాలువల ద్వారా నీళ్లు తీసుకువస్తామని ఆమె పేర్కొన్నారు. ధర్మవరం చెరువుతో పాటు 49 చెరువులకు తాగు, సాగునీరు అందిస్తామన్నారు. రామగిరిలో నిర్మాణదశలో ఉన్న ఆర్‌అండ్‌బి అతిథిగృహాన్ని ఆమె పరిశీలించారు. నిర్మాణపనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. వెంకటాపురం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సునీత కుటుంబ సభ్యులకు మంత్రి చేతులమీదుగా అందించారు. రూ.1,34,230ల చెక్కును అందించారు.