అనంతపురం

బడుగుల అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 3:రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రజక సహకార సంఘాల సమైఖ్య చైర్మెన్ రాజమండ్రి నారాయణ వెల్లడించారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో రజక సహకార సంఘాల డైరెక్టర్ షణ్ముగం, వడ్డెర్ల ఫెడరేషన్ చైర్మెన్ దేవళ్ల మురళీతో కలసి ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా బిసిలకు రాష్ట్ర సిఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పించే క్రమంలో ఫెడరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మెన్లు నియమించి ప్రజలకు మరింత చేరువగా పాలనను అందిస్తున్నారని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షే పఫలాలు అందే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు సేవచేసేందుకుగాను తమకు పదవులు కల్పించిన సిఎం ఎల్లవేళాలా రుణపడివుంటామన్నారు. ప్రస్తుతం ఏపిలోని 6 జిల్లాల్లో సమీక్షా సమవేశాలు ఏర్పాటు చేసి రజక ఫెడరేషన్, అనుబంధ కమిటీల కార్యకలాపాలను, సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలోని రజకు సమస్యలు, వారి జీవన విధానాన్ని తెలుసుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికి చేరువ చేయాలని వచ్చామన్నారు. కానీ జిల్లా స్థాయి కమిటీల్లో ఉన్న అధికారులు ప్రజలకు సమస్యలు పరిష్కరించే క్రమంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సిఎం పేదరిక నిర్మూలన కోసం సిఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆర్థికలోటు వున్నప్పటికి బిసి వర్గాల అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు, సామాజిక పిరస్థితులను మెరుగపరుచుటకు తమ ఫ్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇటీవల రజకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంలో సిఎం కీకల నిర్ణయం తీసుకున్నారని, రానున్న రోజుల్లో పార్లమెంటు, రాష్ట్ర క్యాబినెట్‌లో కూడ బిల్లును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటన్నట్లు తెలిపారు. రజక ప్రాథమిక సంఘాల ద్వారా సబ్సిడీ పథకాలు మంజూరు, జిల్లాలో కొత్త దోబీ ఖానాలు నిర్మాణం, లాంటి కార్యక్రమాలు, సంఘ సభ్యులకు మార్జిన్ మనీ సబ్సిడీ పథకం, బిసి అభ్యుదయ యోజన పథకం, తదితర వాటిని అమలుచేస్తున్నదన్నారు. 2015-16 సంవత్సరంలో 52కోట్లు బడ్జెట్‌ను మంజూరు చేస్తే కొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల నిధులు సక్రమంగా వినియోగించకువలేదని తెలిపారు. ప్రతి జిల్లాలో 3 నెలలకొకసారి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సమవాశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ ఇడి నాగభూషణం, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే నరేష్, ఉప్పర సంఘం డైరెక్టర్ శ్రీకాంత్, రజక సంఘం నాయకులు దేవేంద్రప్ప, లింగమయ్య, కమ్మన్న, జివికుమార్ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తు కాంగ్రెస్‌దే
* కార్యకర్తలకు అండగా ఉంటాం
* డిసిసి సమావేశంలో కాంగ్రెస్ నేతలు
హిందూపురం, సెప్టెంబర్ 3 : కాంగ్రెస్ పార్టీ కర్మాగారం లాంటిదని, ఆటుపోట్లు కొత్తేమీ కాదని, భవిష్యత్ పార్టీదే అని ఎపిపిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కెహెచ్ ఫంక్షన్ హాలులో డిసిసి అధ్యక్షులు కోటా సత్యం అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన అనంతరమే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని మరోసారి గుర్తు చేశారు. అయితే విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా చేసి బిజెపి, టిడిపి లబ్ధి పొందాయన్నారు. ఈ కుట్రలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్‌కే అధికారం దక్కుతుందన్నారు. ఈ దిశగా కార్యకర్తలు, నాయకులను పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. తాము సైతం కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామన్నారు. గ్రామీణ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక దృష్టి వహిస్తున్నామన్నారు. ఇందుకు కిందిస్థాయి నాయకులు కూడా పార్టీకి అంకితభావంతో సేవ చేయాలన్నారు. ఈ నెలాఖరు లోగా జిల్లాలో నూతన కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జిల్లాకు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితోపాటు అబ్ధుల్‌వహీద్, రవిచంద్రారెడ్డిలు పర్యవేక్షకులుగా ప్రతి నియోజకవర్గంలో పర్యటించి సమీక్ష చేస్తారని రఘువీరా చెప్పారు. ఇప్పటి దాకా పార్టీలో చురుగ్గా వ్యవహరించకపోయిన నాయకుల పట్ల పట్టించుకోలేదన్నారు. ఇకపై పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇచ్చి ఉదాసీనంగా వ్యవహరించేవారిని ప్రక్కకు పెడతామన్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కూడా అందరిని కలుపుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్, వైకాపా అధినేత వైఎస్ జగన్‌లు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలోనే పేరు తెచ్చుకున్నారన్నారు. కర్మాగారం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నాయకులు వస్తుంటారని, వెళుతుంటారని అవేమి కార్యకర్తలు పట్టించుకోరాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాగా సొమ్ము చేసుకొని కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్న నాయకులు పార్టీలు మారడం సిగ్గు చేటన్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి లాంటి ముఖ్యులు కాంగ్రెస్ పార్టీని వీడకుండా జిల్లాకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తానని ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి వారు నిజమైన హీరోలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకూ టిడిపి మెడలు వంచేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఇకపోతే తెలంగాణలో టిడిపి ఎత్తిపోయిందని, వైకాపా రాష్ట్రానికే పరిమితమైందని, పవన్‌కళ్యాణ్ పార్టీ సైతం అంతేనన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజారెడ్డి, స్థానిక నాయకులు బాలాజీ మనోహర్, ఆదిమూర్తి, నాగరాజు, శైవలి రాజశేఖర్, అబ్ధుల్లాఖాన్, ఇందాద్, దీపక్, రహమత్, జమీల్, మల్లెపూల మధు, వివిధ మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.