అనంతపురం

హంద్రీనీవాతో మడకశిర ప్రాంతం సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, సెప్టెంబర్ 4 : మండల పరిధిలోని జంబులబండ, రాళ్లపల్లి గ్రామాల మధ్య నిర్మించే హంద్రీనీవా రిజర్వాయర్ వల్ల మడకశిర ప్రాంతం సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. ఆదివారం హంద్రీనీవా ఎస్‌ఇ సుధాకర్‌బాబుతో కలసి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఎండుతున్న వేరుశెనగ పరిరక్షణ కోసం నాలుగు రోజుల పాటు జిల్లాలో ఉండి పర్యవేక్షించడం ఇందుకు నిదర్శనమన్నారు. హంద్రీనీవా పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి జిల్లాకు శాశ్వత సాగునీటి వసతి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా హంద్రీనీవా పథకం కోసం రూ. 15వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ మాసాంతంలో ఇక్కడి రిజర్వాయర్‌కు నీటిని తీసుకురావడానికి పనులు త్వరితగతిన జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఖరీఫ్‌నాటికి మడకశిర నియోజకవర్గంలోని 165 జలాధారాలకు నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాసమూర్తి, ఎంపిపి సన్నీరప్ప, వైఎస్ ఎంపిపి తిప్పేస్వామి, షౌకత్‌ఆలీ, సర్పంచు శీనా, మద్దనకుంటప్ప, శివకుమార్ పాల్గొన్నారు.