అనంతపురం

గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, సెప్టెంబర్ 11 : రాష్ట్ర విభజన అనంతరం రాజధాని, పెద్ద పరిశ్రమలతోపాటు అభివృద్ధిని కోస్తాంధ్ర ప్రాంతానికి మళ్లించడం ద్వారా రాయలసీమ ప్రాంతం పూర్తిగా అన్యాయానికి గురవుతున్న నేపథ్యంలో కనీసం రైల్వే జోన్‌నైనా గుంతకల్లుకు కేటాయించాలని అఖిలపక్ష కమిటీ నా యకులు డిమాండ్ చేశారు. ఆ దివారం స్థానిక డిఆర్‌ఎం కేంద్ర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటీ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో సీమాంధ్రకు రాజధాని, కోస్తాంధ్రకు హైకోర్టును ఏర్పా టు చేస్తూ పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు. అయి తే ప్రస్తుతం జరిగిన రాష్ట్ర విభజన అనంతరం అన్నీ కోస్తాంధ్రకే ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. విశాఖ పట్టణం రైల్వే జోన్ ఏర్పాటుకు అనువైనది కాదని సాంకేతిక నిపుణులు తేల్చిన నేపథ్యంలో విజయవాడలో చేయాలని సూచించడం దారుణమన్నారు. రైల్వే జోన్‌ను గుంతకల్లులో ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ ప్రాంత ప్రజలకు లబ్దిచేకూరుతుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సీమాంధ్ర ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి ప్రభాకర్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గోపా జగదీష్, మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజినేయులు, సిపిఐ నియోజకవర్గ ఇన్‌చార్జి గోవిందు, సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు, టిడిపి నాయకులు కోటిరెడ్డి, వైకాపా పట్టణ కార్యదర్శి సుధాకర్, సిపిఐ నాయకులు గౌస్, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణరెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.