అనంతపురం

సభామర్యాదలు తెలియని ప్రతిపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, సెప్టెంబర్ 12: అనంత కరవును శాశ్వతంగా తరిమేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. సోమవారం చెనే్నకొత్తపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి సునీత మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అలాగే మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే స్పీకర్ పోడియంపైకి వెళ్లి సభామర్యాదలు కూడా విస్మరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులపై మంత్రి విమర్శించారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని కనీసం సభా మర్యాదలు కూడా తెలియని ప్రతిపక్షం ఉండడం ఆ పార్టీకి వైఎస్ జగన్ అధ్యక్షుడుగా, ప్రతిపక్ష నాయకుడుగా ఉండడం సిగ్గుచేటన్నారు. కరవును జయించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రెయిన్‌గన్‌ల ద్వారా రక్షక తడులు వేరుశనగకు అందిస్తోందన్నారు. రైతులు కూడా అవగాహన చేసుకొని ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేస్తోందన్నారు. అలాగే అక్టోబర్ 20లోగా హంద్రీనీవా సుజల స్రవంతి పనులు పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరందించి వాటి ద్వారా నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటికి నీరందించేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.24 కోట్లు వివిధ అభివృద్ది పనులకు కేటాయించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో అటు రాష్ట్రంలోనూ, ఇటు ని యోజకవర్గంలోనూ ఎటువంటి సమస్యలు లేకుండా గట్టి చర్యలు చేపట్టామన్నారు. అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎల్లవేళలా జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా వ్యవహరించి గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు, పంట సంజీవని వంటివి తవ్వుకోవాలన్నారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, చలి జ్వరంవంటి సమస్యలను అతి త్వరలోనే పరిశీలిస్తామన్నారు. రూ.25 లక్షలతో చెనే్నకొత్తపల్లిలోని బీసీ కాలనీకి తాగునీరు కోసం పైప్‌లైన్లు కూడా మంజూరు చేశామన్నారు. త్వరలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఈ నెల 5న పాముకాటుతో మృతి చెందిన బొజ్జప్ప కుటుంబాన్ని మంత్రి సునీత పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ చమన్‌సాబ్, ఆర్డీవో బాలానాయక్, పంచాయతీరాజ్ డీఈ నారాయణస్వామి, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.నారాయణచౌదరి, ఎంపీపీ అమరేంద్ర, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రామాంజనేయులు, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ దండు ఓబులేసు, అంకే ఆంజనేయులు, సర్పంచి ఆనం కృష్ణారెడ్డి ఉన్నారు.