అనంతపురం

రైతులు అధైర్యపడొద్దు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, సెప్టెంబర్ 13 : రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం మండలంలోని నింబగల్లు హెడ్‌రెగ్యులైటర్ వద్ద ఆయకట్టు రైతులను ఎమ్మెల్సీ కలిశారు. ఈ సందర్భంగా రైతులు తుంగభద్ర ఎగువ కాలవలోని గుంతకల్లు బ్రాంచ్ కాలవ కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, కనీసం ఒక తడికైన నీరివ్వాలని విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్సీ స్పందిస్తూ నింబగల్లు వద్ద ఉన్న హెడ్‌రెగ్యులైటర్ నుంచి కాలవను పరిశీలించి జిబిసి అధికారులతో మాట్లాడారు. నీటి విడుదల ఎన్ని రోజులు కొనసాగుతుందని, రైతులకు ఒక తడికైన సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలను అడిగి తెలుసుకున్నారు. నీరు విడుదల చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా కాలువ నీటిని జిబిసికి నీటిని మళ్లించే విషయంగా హంద్రీనీవా అధికారులతో చర్చించారు. అంతేగాకుండా విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు ప్రతాప్‌నాయుడు, సుంకత్నమ్మ, టిడిపి నాయకులు గోవిందు, పురుషోత్తం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.