అనంతపురం

హిందూపురంలో ఉద్రిక్తత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, సెప్టెంబర్ 13 : రోడ్డు ప్రమాద విషయం చిలికి చిలికి గాలివానై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురం వద్ద ద్విచక్ర వాహనం ఓ వ్యక్తిని ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రాజీ కాగా శ్రీకంఠపురంలోని ఓ వర్గానికి చెందిన పెద్ద మనిషి జోక్యం చేసుకుని ప్రమాదానికి కారణమయ్యాడంటూ ప్రమాదానికి కారకుడైన యువకుడిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రహమత్‌పురం చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు పెద్దసంఖ్యలో గుమిగూడగా విషయం తెలుసుకున్న శ్రీకంఠపురానికి చెందిన యువకులు సైతం పెద్ద ఎత్తున గుమిగూడారు. రైల్వే అండర్ బ్రిడ్జికి ఇరువైపులా పెద్ద ఎత్తున జనం గుమి గూడటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రహమత్‌పురానికి చెందిన యువకులు శ్రీకంఠపురం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా అదేతరహాలో అటు వైపు నుంచి పెద్ద ఎత్తున దారితీసింది. రహమత్‌పురానికి చెందిన యువకులు శ్రీకంఠపురం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా అదేతరహాలో అటు వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటించేందుకు ఉపక్రమించారు. అయితే పోలీసు యంత్రాంగం ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఇరువర్గాలను అదుపు చేయడంలో విఫలమైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన యువకులు శ్రీకంఠపురం వైపు దూసుకెళ్లి ప్రార్థనా మందిరాలపై దాడికి పాల్పడ్డారు. దీంతో మరోవర్గానికి చెందిన యువకులు ప్రతిదాడి చేసేందుకు అండర్ బ్రిడ్జి వైపు పరుగులు తీయగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇకపోతే పోలీసు వాహనంపై కొంతమంది యువకులు దాడి చేశారు. అలాగే ఓ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుడు ద్విచక్ర వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఏదేమైనా చిన్నపాటి ఘటన ఇరువర్గాల నడుమ ఘర్షణకు దారి తీయగా తగు రీతిలో పోలీసు అధికారులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయకపోగా అ దుపు చేయడంలో ఉదాసీనత పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఎ స్పీ రాజశేఖర్ బాబు రాత్రికి హిందూపురం చేరుకుని శాంతిభద్రతలను ప ర్యవేక్షిస్తున్న ఏదిఏమైనా అండర్ బ్రిడ్జి వద్ద పోలీస్ వాహనం, ద్విచక్ర వాహనా లు, కార్లపై దాడి చేయడంతో భయాందోళనలకు గురయ్యారు.